Thursday, December 2, 2021

Latest Posts

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడగండి – రేవంత్‌రెడ్డి

Revanth Reddy Serious Comments On CM KCR

దళిత బంధు పేరుతో సీఎం కేసీఆర్ మరోసారి దళితులను మోసం చేసే కుట్ర చేస్తున్నారన్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.  ఈ రోజు (శనివారం) నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో దళితులకు, గిరిజనులకు భూములు ఇస్తే కేసీఆర్ గవర్నమెంట్ ఆ భూములను లాక్కుంటున్నారని అన్నారు. దళితులకు 10లక్షలు ఇస్తామంటే కేసీఆర్ ను ఎవ్వరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలను దళిత బంధుపై ఏకగ్రీవ తీర్మానం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని రేవంత్‌రెడ్డి అన్నారు. ట్యాంక్ బండ్ పక్కనే ఉన్న సచివాలయం భూములను, లేదంటే ప్రగతి భవన్‌ను అమ్మి ఇచ్చిన మాకు అభ్యతరం లేదన్నారు. అలాగే నియోజక వర్గాల్లోని ప్రజలు  టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను 10 లక్షలు ఇస్తావా, చస్తావా అని అడగాలన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం దళిత, గిరిజన దండోరాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రపంచ గిరిజన దినోత్సవం ఆగస్ట్ 9 నుంచి దళిత గిరిజన దండోరాను మొదలుపెట్టబోతున్నామని  పిలుపునిచ్చారు రేవంత్‌రెడ్డి. దళిత, గిరిజన దండోరా చేసి కేసీఆర్ గడీలను పగలగొడతామని హెచ్చరించారు రేవంత్‌రెడ్డి.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss