Tuesday, December 1, 2020

Latest Posts

మంచి చేసిన నివర్ తుఫాన్

Nivar Cyclone గత నెలలో వచ్చిన నివర్ తుఫాన్ ధాటికి తమిళనాడు, ఎపి లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలు వణికిపోయాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి ఈ రెండు జిల్లాలు కుదేలు...

దూసుకొస్తున్న బురేవి తుఫాన్… రెడ్ అలర్ట్

Cyclone Burevi Effect on AP నివర్ తుఫాన్ చేసిన బీభత్సం మరచిపోకముందే మరో తుఫాన్ దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఇది తీవ్ర వాయుగుండంగా అనంతరం...

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

ఏపీలో కరోనా కేసుల పెరగడంపై అప్రమత్తం

Rise of coronavirus(COVID-19) cases in the AP

ప్రపంచమంతా వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత్ లో  లాక్‌డౌన్‌ అమలావవుతోంది. అయినా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ నిజాముద్దీన్ లింక్  తో దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులలో భాగంగా ఏపీలో కూడా పెరుగుతున్నాయి. 250కేసులు దాటిపోవడంతో ప్రధాని మోడీ రాష్ట్రంలో పరిస్థితిపై సీఎం జగన్ తో మాట్లాడి తగు సూచనలు చేసారు.  ఇక అధికార యంత్రాంగంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కీలక ఆదేశాలిచ్చారు. లాక్ డౌన్  ఎత్తివేసిన తర్వాత కూడా రాష్ట్రంలో కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలు అమలులో ఉంటాయని ఆయన   స్పష్టం చేశారు. అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లో మార్గదర్శకాలను కొనసాగించాల్సిందేనని అధికారులను ఆదేశించారు.

కరోనా వైరస్‌ విజృంభనపై ఆదివారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.  సమీక్షలో సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ను ఈ నెల 14వ తేదీ తర్వాత కొనసాగించడమా.. విడతల వారీగా సడలించడమా.. లేదా పూర్తిగా ఎత్తివేయడమా అనే అంశాలపై కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలను రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయడానికి సన్నద్ధం కావాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం జగన్ సూచించారు. కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యాచరణను అమలులోకి తీసుకురావాలన్నారు.

కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి ఆస్పత్రిలోనూ ఐసొలేషన్‌ వార్డు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.  కాగా  ఇప్పటికే ఏడు చోట్ల ల్యాబ్‌లు ఉన్నాయని..విశాఖ, విజయవాడ సహా మూడు చోట్ల ల్యాబ్‌ల సామర్థ్యం పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు వివరించారు. విశాఖలో రెడ్‌ జోన్లను 8 క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్‌ నుంచి 20 నమూనాలు తీసుకుని పరీక్షించామని అధికారులు చెప్పగా, ఇది మరింత పకడ్బందీగా జరగాలని సీఎం ఆదేశించారు. కేటగిరీల వారీగా నమూనాలు పరీక్షిస్తూ ఉండాలన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

మంచి చేసిన నివర్ తుఫాన్

Nivar Cyclone గత నెలలో వచ్చిన నివర్ తుఫాన్ ధాటికి తమిళనాడు, ఎపి లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలు వణికిపోయాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షానికి ఈ రెండు జిల్లాలు కుదేలు...

దూసుకొస్తున్న బురేవి తుఫాన్… రెడ్ అలర్ట్

Cyclone Burevi Effect on AP నివర్ తుఫాన్ చేసిన బీభత్సం మరచిపోకముందే మరో తుఫాన్ దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఇది తీవ్ర వాయుగుండంగా అనంతరం...

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

Don't Miss

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

కేబుల్‌ టీవీ దిగ్గజం రాజశేఖర్‌ మృతి

ఈరోజు  (ఆగష్టు 29) ఉదయం కేబుల్ టీవీ రంగ ప్రముఖులు, వెంకటసాయి మీడియా సంస్థ అధిపతి, హాత్ వే రాజశేఖర్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో గుండె పోటుతో మరణించారు. చెలికాని...

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

త్వరలో రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

కూలిపోయిన గోల్కొండ కోట గోడ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోల్కోండ కోటలోని ఓ గోడ కూలిపోయింది. శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయానికి ముందున్న దాదాపు 20 అడుగుల ఎత్తైన గోడ కూలిపోయింది. కరోనా కారణంగా పర్యాటకుల తాకిడి లేకపోవడంతో...

హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం

హైదరాబాద్ లో ఈ రోజు (శనివారం) సాయంత్రం పలు ప్రాంతాల్లో మరోసారి వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎలాంటి మబ్బలు లేకుండా ఆహ్లదకరంగా ఉన్న వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా ఉన్నట్టుండి హఠాత్తుగా మేఘాలు...