Sunday, February 28, 2021

Latest Posts

ఆర్జేడీ నుంచి పీకే కి భారీ ఆఫర్

బిహార్ కి చెందిన ఎన్నికల వ్యూహనిపుణుడు ప్రశాంత్ కిశోర్ ది కాస్త భిన్నమైన వ్యవహారం. ఆచితూచి అన్నట్లుగా తాను మద్దతు ఇవ్వాల్సిన పార్టీని ఎంపిక చేయటం.. సదరు పార్టీని అధికారంలోకి తీసుకురావటం టాస్క్ ను తీసుకుంటే.. దాన్ని విజయవంతంగా పూర్తి చేసే వరకూ నిద్రపోరన్నది ఎన్నో సంఘటల్లో రుజువైంది. ఆయా రాష్ట్రాల్లో ఇలాంటి కసరత్తులు చేస్తూనే, బిహార్ అధికారపక్షం జేడీయూలో కీలక నేతగా ఎదిగారు.

అయితే కేంద్రంలోని మోడీ సర్కార్ పై ప్రశాంత్ కిషోర్ చేస్తున్న విమర్శల దాడి నేపథ్యంలో కేంద్రంతో సఖ్యత గా ఉంటున్న నితీశ్ కి కోపం వచ్చింది. ఈనేపధ్యంలో నితీష్ కి కు పీకేకు మధ్య మాటల యుద్ధం ముదరటం.. అది అంతకంతకూ పెరిగిపోవడంతో పీకేపై సస్పెన్షన్ వేటు వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇది కూడా పాత వార్తే. కాకుంటే.. ఈ ఎపిసోడ్ కు సంబంధించి తాజాగా మరోకీలక పరిణామం చోటు చేసుకుంది. పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ ను తమవైపు తిప్పుకునేందుకు విపక్ష ఆర్జేడీ తన ప్రయత్నాల్ని షురూ చేసింది.

ప్రశాంత్ కిశోర్ ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. ఆ పార్టీ ముఖ్యనేత కమ్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ తాజాగా బహిరంగ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు పీకేను ఆర్జేడీలోకి తీసుకొచ్చేందుకు పలువురు నేతలు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఏమైనా అధికార పార్టీ సస్పెన్షన్ వేటు వేసిన ఒక నేత కోసం ఇంత డిమాండ్ చేయడం నిజంగా గ్రేట్ అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. పీకే లాంటి మాస్టర్ మైండ్ తమ పార్టీలోకి వస్తే.. ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోవటం షూర్ అని ఆర్జేడీ భావన. ఈ ఆఫర్ కు పీకే సానుకూలంగా స్పందిస్తారా లేదా అనేది చూడాలి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss