Thursday, December 2, 2021

Latest Posts

దరువేసిన రోజా

Roja Beats Drum At Puttur

నగరి ఎమ్మెల్యే రోజా నియోజకవర్గంలో ప్రభుత్వం కళాకారులకు ఇచ్చిన డప్పులను, డ్రెస్ లను పంపిణి చేశారు. ఈ సందర్భంగా పుత్తూరులో ఏర్పాటు చేసిన సభలో డప్పు కొట్టారు రోజా. మంగళవారం నగరినియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంన్నారు. ఇదే క్రమంలో పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన సభలో ప్రభుత్వం 72 మంది డప్పు కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేసిన డప్పు, డ్రెస్సు, గజ్జెలు, డప్పు కర్రలు, పై పంచె తదితర పరికరాలను రోజా అందచేశారు. కళాకారులకు ఇచ్చిన డప్పులను, డ్రెస్ లను పంపిణి చేసి డప్పు కళాకారులతో కలిసి డప్పు వాయించి డప్పు కొట్టి కళాకారులని ఉత్సాహపర్చారు ఎమ్మెల్యే రోజా.  ఈ సందర్బంగా రోజా మాట్లాడుతూ కుల వృత్తులను, కళాకారులను ఆదుకునేందుకు వైఎస్ జగన్ సర్కార్ ఎప్పుడు ముందుంటుందన్నారు. అలాగే ఆసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా నియోజకవర్గ పాదిరేడు- ఎల్.ఎం కండిగ వయా తట్నేరి నుంచి తట్నేరి దళిత వాడ రోడ్డు నిర్మాణాన్ని చేయించినందుకు కృతజ్ఞతతో ఎమ్మెల్యే కు స్థానిక నాయకులు, ప్రజలు ఘనంగా సత్కరించారు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss