Thursday, December 2, 2021

Latest Posts

అమరా రాజా బ్యాటరీల విషయంలో ప్రభుత్వాన్ని తప్పుపట్టకూడదు – ఎం‌ఎల్‌ఏ రోజా

Roja Responds on Amar Raja Batteries Issue

నగరి ఎం‌ఎల్‌ఏ రోజా అమరా రాజా బ్యాటరీలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని తరలి తమిళనాడు వెళ్లిపోవడం పై ధీటుగా స్పందించారు. ఈ విషయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం అనైతికమని రోజా శుక్రవారం అన్నారు. రోజా ఈ విషయం పై మీడియాతో మాట్లాడుతూ, ఏ‌పి‌ కాలుష్య నియంత్రణ బోర్డు రాష్ట్రంలోని 54 పారిశ్రామిక యూనిట్లకు నోటీసులు జారీ చేసిందని, కాలుష్య నియంత్రణ పరిమితులను పాటించాలని ఆదేశించింది.

అయితే వారు ఇవి పాటించడంలో విఫలం అయ్యారని దురదృష్టవశాత్తు, దీనిని చంద్రబాబు నాయుడు దీనిని రాజకీయ సమస్యగా ఎంచుకున్నాడని ఆమె అన్నారు. మనుషుల జీవితాల భద్రత మరియు కర్మాగారం పరిసరాలలో గాలి, నీరు మరియు భూమి వలన కలిగే కాలుష్యం గురించి పట్టించుకోలేదని ఎం‌ఎల్‌ఏ రోజా అన్నారు. ఏ‌పి‌ కాలుష్య నియంత్రణ బోర్డు ఇచ్చిన నిబంధనలను పాటిస్తే కర్మాగారాల పనితీరును రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ వ్యతిరేకించదని చెప్పారు. అయితే, అమర రాజా కర్మాగారం రాష్ట్రంలో తన యూనిట్‌ను మూసివేయాలని ప్రభుత్వం ఎప్పుడూ కోరుకోలేదని ఆమె అన్నారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss