Sunday, June 20, 2021

Latest Posts

60 కోట్లు పెట్టి బంగ్లాను కొన్న ఆర్‌ఆర్‌ఆర్ నటుడు

RRR Actor Ajay Devgan Buys 60 Crore New Bungalow

బాహుబలి తర్వాత ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ చిత్రం కూడా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇండియా వైడ్ గా రీచ్ కావడం కోసం బాలీవుడ్ నటులను ఈ సినిమాలో తీసుకున్నాడు రాజమౌళి. అందులో భాగంగా హీరోయిన్ ఆలియా భట్, అజయ్ దేవ్గన్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ ఆర్‌ఆర్‌ఆర్ నటుడు అజయ్ దేవ్‌గన్ ముంబైలో రూ.60 కోట్ల విలువైన ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేశారు.

ఈ కొత్త బంగ్లా జూహులో ఉంది మరియు ఇది అతని ప్రస్తుత నివాసానికి సమీపంలోనే ఉంది. అజయ్‌తో పాటు భార్య కాజోల్, పిల్లలు న్యాసా, యుగ్ వారి ఇంట్లోనే ఉంటారు. 590 చదరపు గజాల విస్తీర్ణంలో, ఈ బంగ్లా చాలా ఆకర్షణీయంగా ఉన్నట్లు సమాచారం.

ఈ కొత్త బంగ్లా అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, ధర్మేంద్ర వంటి స్టార్స్ ఉండే చోట కొన్నారు అజయ్ దేవ్‌గన్. అమితాబ్ ఇటీవలే అదే ప్రాంతంలో 31 కోట్ల విలువైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశాడు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss