Tuesday, January 25, 2022

Latest Posts

“ఆర్ఆర్ఆర్” ఫస్ట్ సాంగ్ ఎప్పుడంటే

RRR first song release Date Announced

దర్శక దిగ్గజం జక్కన్న  మల్టీస్టారర్ గా రూపొందుతున్న మూవీ “ఆర్ఆర్ఆర్” ఈ మూవీపూర్తయ్యే దశలో చేరుకుంది. ఈ మూవిలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్  ప్రధాన పాత్రల్లో నటిస్తున్నా విషయం  తెలిసిందే. ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న కల్పిత కథ “ఆర్ఆర్ఆర్”. అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టిఆర్ కనిపించబోతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు.

“5 భాషలు. 5 ప్రముఖ గాయకులు” అంటూ “ఆర్‌ఆర్‌ఆర్” సాంగ్ 5 భాషల్లో విడుదల కానుండటంతో 5 మంది గాయకులు థీమ్ సాంగ్ కోసం తమ వాయిస్‌ని అందించారని వెల్లడించింది.అయితే ఫస్ట్ సాంగ్ ఆగష్టు 1న రానున్నట్లు అనౌన్స్మెంట్  చేశారు. అయితే  “దోస్తీ” పేరుతో వస్తున్న ఈ సాంగ్ కు తెలుగులో సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించగా, కీరవాణి సంగీత సారథ్యంలో హేమచంద్ర ఆలపించారు. మిగతా నాలుగు భాషల్లో అనుదీప్‌, అమిత్‌ త్రివేది, విజయ్‌ ఏసుదాసు, నజీర్‌ ఈ సాంగ్ ను పాడారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss