Sunday, June 20, 2021

Latest Posts

ఎన్‌టి‌ఆర్ పుట్టిన రోజు నాడు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా అప్డేట్ ఇదేనా!

RRR Movie Release Date
మెగా హీరో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రం `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఇదే సమయంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్తంబించిపోయింది. ప్రస్తుత సమాచారం ప్రకారం 80 శాతం చిత్రీకరణ పూర్తయిందని, అయితే చాలా పెండింగ్ వర్క్స్, టెక్నికల్ వర్క్స్ చేయాలని తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్లు సాగితే అక్టోబర్ లో దసరాని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది.

కానీ కొవిడ్ -19 సెకెండ్ వేవ్ చెలరేగడంతో ఈ సినిమాని అప్పుడు రిలీజ్ చేసే అవకాశం లేదని తెలుస్తుంది. దీంతో ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ సినిమా రిలీజ్ ను తాత్కాలికంగా వాయిదా వేసుకుని కొత్త తేది ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేశారని తెలిసింది.

ఈనెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కొత్త రిలీజ్ తేదీని ప్రకటించాలని చూస్తున్నారట జక్కన్న టీమ్. 2022 వరకు సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ టీమ్ సభ్యులు కొందరు కొవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. తొలి వేవ్ లో రామ్ చరణ్ కొవిడ్ బారిన పడగా..సెకెండ్ వేవ్ లో జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్ కు కరోనా సోకింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉంటూ వీరు చికిత్స తీసుకుంటున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss