Sunday, June 20, 2021

Latest Posts

ఎన్‌టి‌ఆర్ పుట్టిన రోజు కానుకగా ఆర్‌ఆర్‌ఆర్ కొత్త పోస్టర్ విడుదల

RRR New Poster Released

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భముగా అతను ఎస్ ఎస్ రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం నుండి ఎన్‌టి‌ఆర్ యొక్క కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశాడు దర్శక దీరుడు. ఈ చిత్రంలో తారక్ గిరిజన నాయకుడు కొమరం భీమ్ పాత్రలో నటించారు, ఇందులో రామ్ చరణ్, అలియా భట్ మరియు అజయ్ దేవ్‌గన్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ కొత్త పోస్టర్ ని రాజమౌళి షేర్ చేస్తూ ఇలా చెప్పారు. నా భీమ్ మనసు బంగారం వంటిది. అయితే తిరుగుబాటు చేసినప్పుడు మాత్రం బలంగా మరియు ధైర్యంగా నిలుస్తాడు. పోస్టర్ రివీల్ చేస్తూ ‘ఇంటి వద్దే ఉండండి, సురక్షితంగా ఉండండి మరియు వేడుకలకు బయటకు రాకూడదని కోరింది చిత్ర బృందం’.

భారతదేశంలో తీవ్రమైన కోవిడ్ -19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవద్దని జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులను కోరారు. మన దేశం కరోనావైరస్‌తో యుద్ధంలో ఉందని, ఇది పుట్టినరోజు వేడుకలు జరుపుకునే  సమయం కాదని తారక్ తెలిపారు.

 ఆర్‌ఆర్‌ఆర్ స్వాత్యంత్ర సమర యోధులు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న కథ. ఈ చిత్రం అక్టోబర్ 13 న తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, మరియు అనేక ఇతర భారతీయ భాషలలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss