RRR Pre Release Business Is Shocking
చరిత్రలో నిలిచిపోయిన ఇద్దరు తెలుగు స్వాతంత్ర్య సమరయోధులని ఆధారంగా తెరకెక్కిస్తున్న కథ ఆర్ఆర్ఆర్. కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. అయితే పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ లెక్కలు జనాలకు షాక్‌నిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ హక్కులు భారీగా రూ.570 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. డిజిటల్, శాటిలైట్ హక్కుల పేరిట అప్పుడే రూ.300 కోట్లు పలికాయట. బాలీవుడ్‌కు చెందిన పెన్ స్టూడియోస్ సంస్థ ఈ సినిమా నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులతో పాటు భారతీయ భాషల డిజిటల్, శాటిలైట్, ఎలక్ట్రానిక్ హక్కులను సొంతం చేసుకుంది.
ఇక ఈ పీరియాడికల్ డ్రామాకి ఆంధ్రా, నైజాం ఏరియాలో రూ. 240 కోట్ల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ విశ్లేషకుల అంచనా. అలానే దేశమంతా 250 కోట్లు బిజినెస్ జరగగా ఓవర్సీస్లో రూ.70 కోట్లకు ఆర్ఆర్ఆర్ హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం. మొత్తంగా ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ బిజినెస్ దాదాపు రూ.900 కోట్లుగా జరిగినట్లు తెలుస్తోంది. ఏ తెలుగు సినిమాకు జరగని రీతిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం విశేషం.
ఆర్ఆర్ఆర్ సినిమాను డివివి దానయ్య సుమారు రూ.450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇప్పుడు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్‌తో నిర్మాతలకు కాసుల పంట పండింది. ఈ భారీ మల్టీస్టారర్ అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకి రానుంది.
ఇవి కూడా చదవండి: