Monday, July 26, 2021

Latest Posts

ప్రత్యేకమైన రోజున విడుదల కానున్న ఆర్‌ఆర్‌ఆర్

RRR Release Date Postponed

దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి యొక్క భారీ బడ్జెట్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ ని ఇది వరకే ప్రకటించారు. ఈ సినిమా అక్టోబర్ 13 2021న విడుదల అవుతుందని చెప్పారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కూడా అన్ని సినిమాల్లానే వాయిదా పడింది.

దీనితో ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల చేయడం కష్టం అని తేలింది. తాజాగా ఈ చిత్ర దర్శక నిర్మాతలు మరో విడుదల తేదీ పై కన్నేశారు. అదే భారతదేశ 73 వ గణతంత్ర దినోత్సవం అనగా జనవరి 26 2022. స్వాతంత్ర సమరయోధుల కథ ని గణతంత్ర దినోత్సవం రోజు విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారని సమాచారం.

అంతే కాదు, ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15 న ఆర్‌ఆర్‌ఆర్ బృందం ప్రత్యేక టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ క్రింద డివివి దానయ్య నిర్మించిన ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టిఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, బాలీవుడ్ మరియు హాలీవుడ్ తారలు అలియా భట్, అజయ్ దేవ్‌గన్, ఒలివియా మోరిస్ మరియు రే స్టీవెన్‌సన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss