Sunday, June 20, 2021

Latest Posts

ఆర్‌ఆర్‌ఆర్ శాటిలైట్, డిజిటల్ రైట్స్ కి రెక్కలు

RRR Satellite Rights

పాన్ ఇండియా దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలకు బయ్యర్ల నుండి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. తాజాగా “ఆర్ఆర్ఆర్” డబ్బింగ్, శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను కొనుగోలు చేయడానికి చాలా మంది ముందుకు వచ్చినప్పటికీ ఇంకా అవి పూర్తి కాలేదు.  ఈ చిత్రం యొక్క శాటిలైట్ మరియు డిజిటల్ హక్కుల కోసం డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఈ చిత్ర బృందం భారీ మొత్తాన్ని ఆశిస్తోన్నట్లు సమాచారం.

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంలో  జూనియర్ ఎన్టిఆర్, రామ్ చరణ్, ఒలివియా మోరిస్ మరియు అలియా భట్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పీరియడ్ యాక్షన్ డ్రామా అని చెప్పుకునే ఈ చిత్రం క్లైమాక్స్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13 న విడుదల చేయాలని రాజమౌళి నిర్ణయించారు. డి వి వి దానయ్య నిర్మిస్తున్న “ఆర్ఆర్ఆర్”కి 450 – 500 కోట్ల బడ్జెట్ అయ్యిందని సమాచారం.

ప్రస్తుత సమాచారం ప్రకారం అమెజాన్ ప్రైమ్ మరియు హాట్ స్టార్ ఈ సినిమా యొక్క ఓటిటీ స్ట్రీమింగ్ హక్కులు మరియు శాటిలైట్ హక్కులను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చాయి. వీరిద్దరూ వరుసగా 130 కోట్లు, 160 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. కానీ ఈ చిత్రానికి అధిక డిమాండ్ ఉన్నందున “ఆర్ఆర్ఆర్” బృందం ఇంకా ఎక్కువ మొత్తాన్ని కోసం వెయిట్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇలా చేయడం వల్ల ఆర్‌ఆర్‌ఆర్ కి కలిసి వస్తుందో లేదో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss