Sunday, March 7, 2021

Latest Posts

ఆర్ ఆర్ ఆర్ పై మార్చిలో అప్ డేట్ ఏంటో తెలుసా

RRR UPDATES TO KICK START FROM MARCH:

ఆర్ ఆర్ ఆర్ పై మార్చిలో అప్ డేట్ ఏంటో తెలుసా
బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి పక్కా ప్లాన్ తో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోలుగా రూపొందిస్తున్న తాజా మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్`మూవీ. వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టిన జక్కన్న ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్తలూ ఇప్పటివరకు బయటకు కూడా రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఎందుకంటే గతంలో రెండు మూడు లీకులు రావడంతో జక్కన్న స్ట్రిక్ట్ గా రూల్స్ అమలు చేస్తున్నాడు. దీంతో ఎలాంటి వార్త బయటకు రావడంలేదని చెప్పాలి. పైగా ఇద్దరు టాప్ హీరోలు నటిస్తున్న చిత్రం కావడంతో వారి అభిమానులు సినిమా అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూడడం కూడా సహజం. అందుకే అన్నింటిని దృష్టిలో ఉంచుకుని చిత్ర బృందం ద్వారా అప్ డేట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఫాన్స్ కూడా సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వాలంటూ సోషల్ మీడియా ద్వారా చిత్రబృందానికి విజ్ఞప్తులు చేస్తున్నారు.

తాజాగా ఓ నెటిజన్ `ఆర్ఆర్ఆర్` పేజీని ట్యాగ్ చేస్తూ `అప్‌డేట్స్ ఇంకెప్పుడు ఇస్తావు` అంటూ కోపంగా ఉన్న ఎమోజీలను పోస్ట్ చేశాడు. దీనికి స్పందించిన చిత్రబృందం `మార్చి నుంచి` అని సమాధానం ఇవ్వడంతో ఏదో రాబోతోందని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పైగా మార్చి 27వ తేదీన రామ్‌చరణ్ జన్మదినోత్సవం కావడంతో ఆ సందర్భంగా `ఆర్ఆర్ఆర్`లో చెర్రీ లుక్ విడుదలవుతుందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. మరి, చిత్రబృందం చేసిన తాజా ట్వీట్‌ని బట్టి చూస్తే ఆ వార్తలు నిజం అవుతాయా అనిపిస్తోంది. అదే నిజమైతే అభిమానులకు పండగే.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss