లాక్ డౌన్ కారణంగా ఎక్కడెక్కడో చిక్కుకున్న వలస కార్మికులు తమ సొంత ఊరికి కాలినడకన వెళ్తున్న దృశ్యాలు హృదయదారకంగా మారాయి. కాగా వలస కార్మికులను వారి గమ్యస్థానాలను సురక్షితంగా పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ శ్రీ ఎం.వి. శేషగిరి బాబు వారి ఉత్తర్వుల మేరకు ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు చెందిన 35 మంది వలస కార్మికులను ప్రత్యేక అర్.టి.సి. బస్సు లో వారి జిల్లాకు పంపించడం జరిగిందని వెంకటాచలం తహసిల్దార్ శ్రీ ఐ. ఎస్. ప్రసాద్ తెలిపారు.
వీరు చెన్నై నుండి కాలినడకన శ్రీకాకుళంకు వెళ్లుచుండగా, వీరిని వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద గుర్తించి వెంకటాచలం ఆర్.టి.సి. ట్రైనింగ్ భవనంలో మూడు రోజులు భోజన వసతులు కల్పించి, అధికారుల అనుమతులు తీసుకుని ఈరోజు వారిని శ్రీకాకుళంకు పంపడం జరిగిందని తహసీల్దార్ తెలిపారు. 35 మంది వలస కూలీలకు వైద్య సిబ్బంది క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించి, వారికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేసి వారి యొక్క గమ్యస్థానాలకు పంపించినట్లు ఆయన తెలిపారు. ఎలా అన్నీ రాష్ట్రాలు చొరవ తీసుకుని వారిని వారి గమ్యాలకు చేర్చడంలో తోడ్పడాల్సిందిగా సామాన్య ప్రజలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: వలస కూలీల పై మానవతా దృక్పథంతో వ్యవహరించాలి: పవన్ కళ్యాణ్