Russian Prime Minister Mikhail Mishustin Tests Positive for Coronavirus
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గొప్పా పేద అనే తేడాలేకుండా ఎవరినీ వదలడం లేదు. బ్రిటన్ ప్రధాని, బ్రిటన్ యువరాజు ఇలా ఎందరో ప్రముఖులను తాకిన కరోనా ఎన్నో అగ్రరాజ్యాలను గడగడలాడిస్తోంది. తాజాగా కరోనా బారినపడిన దేశాల అగ్రనేతల జాబితాలో రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్టిన్ (54) కూడా చేరారు. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్లారు. ఆర్థిక వ్యవహారాల బాధ్యతలను పర్యవేక్షించే మిషుస్టిన్ తరచూ అధ్యక్షుడు పుతిన్‌ను కలుస్తుంటారు. ఈ నేపథ్యంలో వీరు చివరిసారిగా ఎప్పుడు భేటీ అయ్యారనే వివరాలు ఆరా తీస్తున్నారు.
ఇక స్పెయిన్‌లో 268, ఇటలీలో 285 మంది చనిపోయారు. గత ఏడు వారాల్లో ఇది చాలా తక్కువని చెప్పాలి. అయినా ఈ రెండు దేశాలు ఇంకా కరోనా గుప్పిట నుంచి బయటపడలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) యూరప్ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. కాగా కొత్తగా 874 కేసులతో పాకిస్థాన్‌లో బాధితుల సంఖ్య 15 వేలు దాటింది. 346 మంది పాణ్రాలు కోల్పోయారు. సింగపూర్‌లో మరో 588 మందికి పాజిటివ్ తేలగా, బాధితుల సంఖ్య 16,169కి చేరింది. బ్రిటన్.. రోజుకు లక్ష మందికి పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది.
మరోవైపు ఆంక్షల సడలింపు హడావుడి స్థాయిలోనే అమెరికాలో కరోనా మరణాలు కొనసాగుతున్నాయి. అగ్రరాజ్యంలో మరో 1,824 వేల మంది వైర్‌సకు బలయ్యారు. 26,809 కేసులు నమోదయ్యాయి. దేశంలోని జైళ్లలో 2,700 మంది ఖైదీలకు పరీక్షలు చేయగా 2 వేల మందికి పాజిటివ్ వచ్చింది. అయితే, కష్టాలు పోనున్నాయని, ముందుంది మంచి కాలమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొంటున్నారు. ‘ఓపెనింగ్ అప్ అమెరికా ఎగైన్’ పేరిట పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.