ప్రభాస్.. యంగ్ రెబెల్ స్టార్ నుంచి ఇండియన్ సూపర్ స్టార్ రేంజ్ కి చేరిన ప్రభాస్ క్రేజ్ వరల్డ్ వైడ్ రీ సౌండ్ ఇస్తుంది. బాహుబలి సినిమాతో నార్త్ ఇండియా అంతటా మంచి ఫాలోయింగ్ సంపాదించిన ప్రభాస్, బాహుబలి 2 తో వారి గుండెల్లో చెరుగని ముద్ర వేసుకున్నాడు. కాగా ఈ మాట రీసెంట్ గా రిలీస్ అయ్యి తెలుగు లో పెద్దగా ఆడకపోయినా నార్త్ ఇండియా లో రికార్డు కలెక్షన్స్ తో అక్కడ కేక పుట్టించి, ఆ టైమ్ కి రిలీస్ అయిన సూపర్ స్టార్ సినిమాలను మించే ఓపెనింగ్స్ రాబట్టడం దీనికి రుజువు.
కాకపోతే ఇలాంటి రికార్డు ఒకటి ప్రభాస్ మళ్ళీ చేశాడు, అది సిల్వర్ స్క్రీన్ మీద కాదు బుల్లి తెర మీద. అవును, లాక్ డౌన్ సమయంలో టెలివిజన్ లో కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నారు. వాటిలో సాహో ఒకటి కాగా పేరున్న హింది చానల్ లో ప్రసారమయిన ఈ మూవీ 83 లక్షల ఇంప్రెషన్స్ సాధించి, ఇంతటి ఇంప్రెషన్స్ సాధించిన మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది. కాగా మరో చానల్ లో ప్రసారమయిన బాహుబలి కూడా అదే రేంజ్ లో టిఆర్పి ను రాబట్టింది.
Saaho Movie Television Views Sets New Record In North India
ఇది కూడా చదవండి: ఈ 2020 సంవత్సరంలో ఇంకా ఏమేం చూడాల్సి వస్తుంది: హీరో నాని