కరోనా లాక్డౌన్ అనంతరం కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమల ఆలయం అక్టోబర్ 16వ తేదీన తిరిగి తెరుచుకోనుంది. ఈ నెల 16 నుంచి మాసపూజల నేపథ్యంలో ఐదు రోజులపాటు శబరి సన్నిధానం తలుపులు తెరుచుకోనున్నాయి. కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్టు పేర్కొంది. రోజుకు కేవలం 250 మంది భక్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. శనివారం రాత్రి నుంచి ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు తెలిపింది.
భక్తులందరూ పంబా ప్రాంతానికి చేరుకునే 48 గంటల ముందే కోవిడ్-19 పరీక్షల్లో నెగిటివ్ అని తేలి ఉండాలని. ఆ సర్టిఫికేట్‌తో వచ్చిన వారినే ఆలయానికి పంపనున్నట్టు తెలిపింది. నెగటివ్ సర్టిఫికెట్ లేకుండా వచ్చే భక్తుల కోసం పంపా బేస్ వద్ద పరీక్ష కేంద్రాలు ఉంటాయని, అయితే ఫలితాలు వచ్చేదాకా భక్తులు వేచి ఉండాల్సిందేనని చెప్పారు. పంబా నదిలో స్నానాలు చేయడానికి అనుమతి లేదని తెలిపింది. కొండపై స్టే చేయడానికి ఎవరికీ అనుమతి లేదని చెప్పింది.అయితే భక్తులు కొండపైకి నడిచే సమయంలో మాస్క్ ధరించడ వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వైద్యలు చెబుతున్నారు.”ఆలయం తెరిచి ఉంచనున్న ఈ ఐదు రోజుల పాటు పరిస్థితులను క్షుణంగా పరిశీలిస్తాం. దీని ఆధారంగా నవంబర్ నుంచి మండల యాత్రల కోసం ఆలయాన్ని తెరవాలా? లేదా? అనే నిర్ణయం తీసుకుంటాం” టీడీబీ ఆలయ చెర్మన్ ఎన్ వాసు తెలిపారు.
ఇది కూడా చదవండి: