Sunday, May 9, 2021

Latest Posts

విషమించిన సబ్బం హరి ఆరోగ్యం

Sabbam Hari Health Condition

ప్రముఖ రాజకీయ నేత, మాజీ ఎంపీ, తెలుగుదేశం నేత సబ్బం హరి ఆరోగ్యం విషమించింది. ఈ తెలుగుదేశం నేత కొద్దిరోజుల క్రితమే కరోన బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు కూడా. తాజాగా సబ్బం హరి పరిస్థితి విషమంగా మారడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

సబ్బం హరి శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఆరోగ్యం విషమించినట్లు చెబుతున్నారు వైద్యులు. ఈ నెల 15వ తేదీన సబ్బం హరికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అవ్వడంతో వైద్యుల సూచన మేరకు మూడు రోజులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కానీ కోలుకోకపోవడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. గత మూడు రోజులుగా వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. సబ్బం హరి ఆరోగ్యం విషమించిందని తెలియడంతో ఆయన అనుచరులు,అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఆయన క్షేమంగా ఆసుపత్రి నుంచి బయటికి రావాలని ప్రార్థిస్తున్నారు. సబ్బం హరి 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున అనకాపల్లి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss