Tuesday, January 19, 2021

Latest Posts

ప్లాన్ ప్రకారం పోలీసులే గూండాగిరి చేశారట!

Sabbam hari fire on police:

ప్లాన్ ప్రకారం పోలీసులే గూండాగిరి చేశారట!

విశాఖ ఘటనపై ఎవరి రేంజ్ లో వాళ్ళు స్పందిస్తున్నారు. వైసిపి,టిడిపి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇక మాజీ ఎంపీ సబ్బంహరి స్పందిస్తూ, విశాఖలో ప్లాన్‌ ప్రకారం పోలీసులు గూండాగిరి చేశారని ఆరోపించారు. పోలీసులు తలుచుకుంటే వందమందిని పక్కకు లాగేయొచ్చని ఆయన చెబుతూ, అయితే టీడీపీ అధినేత చంద్రబాబు యాత్ర ముందుకు సాగకూడదన్న ఉద్దేయసంతో కొందరు పోలీసులు ప్రభుత్వ సూచనల్ని పాటించారని ఆయన విమర్శించారు.

గతంలో బీచ్‌లో కొవ్వొత్తుల ర్యాలీకి హాజరయ్యేందుకు.. సీఎం జగన్‌ వస్తే పర్మిషన్‌ ఇవ్వని మాట వాస్తవమేనని ఆయన గుర్తుచేస్తూ,జల్లికట్టు తరహాలో కార్యక్రమం ఉందని చెప్పినందునే.. జగన్‌ పర్యటనకు అప్పుడు పర్మిషన్‌ ఇవ్వలేదన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబుకు పర్మిషన్‌ ఇచ్చి అడ్డుకోవడం సరికాదని సబ్బం హరి తప్పుబట్టారు. జగన్‌ అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే అవగింజంతైనా అవరోధం కలిగిందా అని ఆయన ప్రశ్నించారు.

మరి చంద్రబాబు ఒక నగరంలో పర్యటిస్తానంటే ప్రభుత్వం ఎందుకు భద్రత కల్పించలేకపోతోందని మండిపడ్డారు. చంద్రబాబు ముందుకు వెళ్లకూడదని పోలీసులు, ప్రభుత్వం కలిసి ఆర్గనైజ్‌ చేశారని, అందుకే టీడీపీ వాళ్లని రానివ్వకుండా వైసీపీ వాళ్లని మాత్రమే ఎయిర్‌పోర్టులోకి పంపించారని ఆయన విమర్శించారు. అణగదొక్కాలని చూసే ప్రతిసారి.. చంద్రబాబు ఒక్కో అడుగు పైకి వస్తున్నారని తెలిపారు. ఈ ఘటనతో విశాఖ ప్రజలకు అక్కడి పోలీసులపై నమ్మకం పోయిందని ఆయన విచారం వ్యక్తంచేసారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss