Sachin Tendulkar Tests Positive For Coronavirus
మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కోవిడ్ -19 భారీన పడ్డారు. ఇప్పటికే పలువురు సినీ సెలెబ్రిటీలు దీని భారీన పడగా ఇప్పుడు సచిన్ కూడా ఆ లిస్ట్ లో చేరారు. తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా సచిన్ ఈ వార్తను ప్రకటించారు.
“నేను కోవిడ్ యొక్క అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను అయినప్పటికీ నేను కరోనా బారీన పడ్డాను. తేలికపాటి లక్షణాలను అనుసరించి నేను ఈ రోజు కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది” అంటూ క్రికెట్ దిగ్గజం సచిన్ తెలిపారు.
అయితే వైద్యుల సలహా మేరకు స్వీయ నిర్బంధంలో ఉన్నానని మరియు తన అవసరమైన అన్ని ప్రోటోకాల్‌లను అనుసరిస్తున్నానని సచిన్ అన్నారు. ఇకపోతే మా కుటుంభ సభ్యులకి మాత్రం నెగెటివ్ గా వచ్చిందని తెలిపారు. ఇక ఈ విషయం తెలిసిన అతని అభిమానులు మాస్టర్ బ్లాస్టర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: