యంగ్ టైగర్ ఎన్టిఆర్ ఈ నెల 20 వ తారీకున పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు అందరూ ఎటువంటి ఇగోలు లేకుండా ఒకరి మీద ఒకరు స్నేహపూర్వకంగా నడుచుకుంటున్నారు. ఎలాంటి స్నేహాలు మొత్తం టాలీవుడ్ హీరోలలో ఉండడం ఇండస్ట్రికి ఎంతో మేలు చెయ్యడమే కాకుండా వారి అభిమానులలో కూడా విద్వేషాలకు తావివ్వకుండా వారు కూడా అలాగే నడచుకునేలా ప్రేరేపిస్తుంది. తాజాగా ఎలాంటి ఒక సంఘటన మెగా ఫాన్స్ కు నందమూరి ఫాన్స్ కు ఆనందాన్ని ఇస్తుంది.
సాయి ధరం తేజ్ తన ట్విటర్ అక్కౌంట్ ద్వారా తన స్నేహితుడు ఎన్టిఆర్ కామన్ డిపిని లాంచ్ చేశాడు. “నేను ఒక సాధారణ వ్యక్తితో నాకు స్నేహం ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు అయ్యింది … నాకు అతను ఒక స్నేహితుడు, కానీ కొద్దిమందికి అతను లైఫ్ హీరో కంటే పెద్దవాడు, తాను ఇప్పుడు ఛేదించరాని ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఎంతో ఎత్తుకు ఎదిగాడు.. నేను అతని పుట్టినరోజు కోసం కామన్ డిపిని విడుదల చేస్తున్నాను.” అని సాయి ధరం తేజ్ తెలియచేసాడు.
It’s been almost 12 years since I’ve forged an ironclad friendship with a normal human being…to me he is a friend but for a few he’s a larger than life hero an idol they look up to…and here I am releasing a #CommonDP for his birthday wish you a very happy birthday in advance pic.twitter.com/vy8xdF16nW
— Sai Dharam Tej (@IamSaiDharamTej) May 10, 2020
ఇది కూడా చదవండి: నయా హీరో విజయ్ దేవర కొండ బర్త్ డే