Sunday, June 20, 2021

Latest Posts

దాదాపు పది కోట్ల వరకు నష్ట పోయిన సాయి పల్లవి

Sai Pallavi Remuneration:

సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది హీరోయిన్ సాయి పల్లవి. పెద్ద, చిన్న సినిమా అనే తేడా లేకుండా కథ నచ్చి, తన క్యారెక్టర్‌ నచ్చితేనే సినిమాని ఒప్పుకుంటుంది. ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే.. తన పాత్రకు ప్రాముఖ్యత లేకుంటే అస్సలు చేయదు.

అలా గత మూడేళ్లలో సాయిపల్లవి రూ.5 కోట్ల వరకు నష్టపోయిందని అంచనా. అదెలా అంటారా?..  సాయిపల్లవి ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోటి రూపాయిల వరకు రెమ్యునరేషన్‌ వసూలు చేస్తుంది. ఈ క్రమంలో గత మూడేళ్లలో సాయి పల్లవి 4 పెద్ద చిత్రాలను తిరస్కరించిందట.

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’లో తొలుత సాయి పల్లవినే హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేసుకున్నారట. అయితే తన పాత్ర నచ్చక ఆ ఆఫర్‌ను వదులుకుందట ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత మహేశ్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా రిజెక్ట్ చేసిందట. దానితో పాటు అయ్యప్పనుమ్ కోషియం( రీమేక్), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాదన్(రీమేక్) వంటి సినిమాలు కూడా వదులుకుంది.

ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమాలు కాబట్టి ఆమెకు కోటికి పైనే పారితోషికం ఇచ్చే అవకాశం ఉంది. అయినా కథ నచ్చకో, సినిమాలో తన క్యారెక్టర్ నచ్చకో ఆమె ఈ సినిమాలను ఒప్పుకోలేదు. ఇలా ఆమె దాదాపు అయిదు కోట్లు నష్టపోయిందని అంచనా. అయితే వీటితో పాటు ఈమె 6 కమర్షియల్‌ యాడ్స్‌ని కూడా ఒప్పుకోలేదట. వీటి వల్ల కూడా మరో 5 కోట్లు నష్టపోయిందని అంటున్నారు.

ఏది ఏమైనా సాయి పల్లవి క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఆమె మంచి సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ప్రస్తుతం సాయి పల్లవి లవ్‌స్టోరీ, విరాటపర్వం చిత్రాల విడుదల కోసం ఎదురు చూస్తుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss