Sunday, June 20, 2021

Latest Posts

భద్రకాళి మాతలా కనిపిస్తున్న సాయి పల్లవి

Sai Pallavi First Look For Shyam Singha Roy Film

హీరోయిన్ సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా, నానితో కలిసి నటిస్తున్న శ్యామ్‌ సింగరాయ్‌ నుండి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు చిత్రబృందం. నాని తన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బెంగాలీ వ్యక్తిలా కనిపించగా, సాయి పల్లవి కూడా ఈ చిత్రంలో తన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బెంగాలీ మహిళగానే కనిపించబోతునట్టు తెలుస్తుంది.

సాయి పల్లవి చేతిలో త్రిశూలంతో సనాతన బెంగాలీ వేషధారణలో భద్రకళిలా కనిపిస్తుంది. ఈ పోస్టర్ లో హీరోయిన్ తో పాటు మరి కొంత మంది మహిళా నృత్యకారులు త్రిశూలంతో నృత్యం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికే విడుదల అయిన నాని ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు సాయి పల్లవి పోస్టర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.

Sai Pallavi First Look For Shyam Singha Roy Film:

ఈ చిత్రాన్ని నాని కంటే ఎక్కువ రేంజ్ బడ్జెట్ లో 40 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. రాహుల్ సంకృత్యన్  దర్శకత్వం వహిస్తుండగా, వెంకట్ బోయనపల్లి నిహారికా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. సాయి పల్లవి తో పాటు కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss