Monday, May 10, 2021

Latest Posts

సలార్ తో ఆ అపవాదును పోగొట్టుకోనున్న కే‌జి‌ఎఫ్ దర్శకుడు

Salaar Movie Updates
బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో సలార్ ఒకటి. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న ఈ సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మామూలుగా ప్రశాంత్ నీల్ సినిమా అంటే హీరోయిన్స్ కు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు అనే అభిప్రాయం ఉంది. అయితే ఆ అపవాదును పోగొట్టనున్నాడంట.

సలార్ సినిమాలో ఆ అపవాదును పోగొట్టుకునేలా ప్రశాంత్ నీల్ హీరోయిన్ ను కాస్త ఎక్కువ సమయం చూపించడంతో పాటు కథలో ప్రాముఖ్యతను కూడా పెంచినట్లుగా తెలుస్తోంది. సలార్ లో శృతి హాసన్ పాత్ర చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. శృతి హాసన్ ను సలార్ లో జర్నలిస్ట్ గా ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడట. జర్నలిస్ట్ గా శృతి హాసన్ చేసే సాహసాలు అన్నీ ఇన్నీ కావంటున్నారు. శృతి హాసన్ తో ఏకంగా స్టంట్స్ ను కూడా దర్శకుడు చేయించబోతున్నట్లుగా తెలుస్తోంది.

కేజీఎఫ్ సినిమాలో చూస్తే హీరోయిన్ కు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. కాని సలార్ సినిమాలో మాత్రం శృతి హాసన్ కు ప్రభాస్ కు జోడీగా మంచి అవకాశం దక్కడంతో పాటు నటనకు కూడా ప్రాముఖ్యత ఉన్న పాత్ర లభించడం జరిగిందని అంటున్నారు. ట్యాలెంటెడ్ బ్యూటీగా పేరున్న ఈ అమ్మడికి సలార్ సినిమాతో మరిన్ని పెద్ద సినిమా ఛాన్స్ లు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss