Sunday, June 20, 2021

Latest Posts

రాధే సినిమాకు రివ్యూ ఇచ్చినందుకు క్రిటిక్ పై కేసు నమోదు

Salman Khan Filed Defamation Case On Critic KRK

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ముంబయి కోర్టులో సినిమా క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ పై పరువు నష్టం దావా వేశారు. తాజాగా విడుదలైన హిందీ చిత్రం ‘రాధే’ కి రివ్యూ ఇచ్చారు కే‌ఆర్‌కే. అయితే ఈ రివ్యూ సినిమా యొక్క వాల్యూ ని తగ్గించందని ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన సల్మాన్ ఖాన్ యొక్క లీగల్ బృందం కే‌ఆర్‌కేకు లీగల్ నోటీసును సోమవారం పంపింది.

ఈ విషయం పై అతను ఇలా ట్వీట్ చేసాడు, “సల్మాన్ ఖాన్ రాధే యొక్క రివ్యూ రాసినందుకు నా పై పరువు నష్టం కేసు పెట్టాడు!, ఇక పై తాను ఏ సల్మాన్ చిత్రానికి రివ్యూ రాయనని తెలిపాడు. ” అంతే కాకుండా కే‌ఆర్‌కే ఏమన్నాడంటే, “నేను చాలా సార్లు చెప్పాను, ఏ నిర్మాత, నటుడి సినిమాను రివ్యూ ఇవ్వవద్దని అడిగితే నేను ఎప్పుడూ రివ్యూ ఇవ్వను. “అని చెప్పాడు.

సల్మాన్ ఖాన్ పంపిన నోటీసు ప్రకారం, గురువారం నగర సివిల్ కోర్టు అదనపు సెషన్స్ న్యాయమూర్తి ముందు అత్యవసర విచారణ కోసం ఈ విషయాన్ని ప్రస్తావించనుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss