ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ,సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. గతకొద్ది రోజులుగా ఉదరకోశ సమస్యలతో బాధపడుతున్నా ఆయనకు నిన్న తీవ్రత ఎక్కువ కావడంతో వెంటనే ఆయన్ను లక్నోలోని మేదాంత ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 80 సంవత్సరాలు. ఆస్పత్రి డైరక్టర్ రాకేష్ కపూర్ ఆయనకు అన్ని రకాల టెస్టులు చేశామని, ప్రస్తుతం ములాయం ఆరోగ్యం మెరుగ్గానే ఉందని త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. కాగా ములాయం సోదరుడు శివపాల్ సింగ్, కోడలు డింపుల్ యాదవ్‌లు ఆస్పత్రిలో ములాయంను పరామర్శించారు.
ఇది కూడా చదవండి:ఘోర రైలు ప్రమాదం