Sunday, June 13, 2021

Latest Posts

పదేళ్లు పూర్తి చేసుకున్న సమంత

Samantha

  సమంతని చూస్తే చాలు… ఎంత సక్కటి అందమో అనాల్సిందే! సుక్కల సీర కట్టుకున్న వెన్నెలలాగా అంటూ సమంత అందం గురించి చంద్రబోస్క లం ఈమధ్యే వర్ణించింది కానీ… ఆమె తొలి చిత్రంలోనే అలా తళుక్కున మెరిశారు. సమంత ఇంతింతై అన్నట్టుగా అంచెలంచెలుగా ఎదిగారు. అందంతోనూ… అభినయంతోనూ… తనకి తానే సాటి అనిపించుకున్నారు. ఆమె తెలుగు తెరపై మాయ చేయడం మొదలుపెట్టి పదేళ్లు పూర్తయ్యాయి. ఇప్పటికీ మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా తన అందంతో… ప్రేక్షకుల్ని సరికొత్తగా ఆకర్షిస్తున్నారు. ఏమాయ చేసావె తో తెలుగులో ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆమె, ఆరంభంలోనే దూకుడు ప్రదర్శించారు.

   వాణిజ్య ప్రధాన చిత్రాలే కాదు… నటనకి ప్రాధాన్యమున్న పాత్రలతోనూ సత్తా చాటారు. ఈ ప్రయాణంలో గుర్తుండిపోయే ఎన్నో మజిలీలు ఆమె సొంతం. ఆమెని ఎప్పుడు పలకరించినా ఆ మజిలీల్ని గుర్తు చేస్తుంటారు. కథానాయికల వృత్తి జీవితం పరిమితం. ఒక కథానాయిక పదేళ్ల ప్రయాణం పూర్తి చేయడమంటే పెద్ద విషయమే. సమంత మాత్రం ఎలాంటి లక్ష్యాలు లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిందట. ఒక్క అవకాశం వస్తే చాలు అనుకునేదాన్ని తొలినాళ్లలో. ఆ అవకాశం దొరకగానే దానికి న్యాయం చేయడంపైనే దృష్టి పెట్టేదాన్ని. అలా ఒకొక్క సినిమా నన్ను ఒక్కో మెట్టు ఎక్కిస్తూ వచ్చింది. ఏమాయ చేసావె తర్వాత తిరిగి చూసుకునే అవసరమే రాలేదు. ఇప్పుడు ఈ ప్రయాణాన్ని ఊహించుకుంటే మాత్రం నిజంగా మాయలాగే ఉంది అంటారు సమంత.

  సవాళ్లంటే సమంతకి చాలా ఇష్టం. మనం, మన పని పది కాలాలపాటు గుర్తుండిపోవాలంటే సవాళ్లని స్వీకరించాల్సిందే అంటారామె. తొలినాళ్లలో సమంతకి ఫలానా పాత్రలే నప్పుతాయి అనుకునేవారు. అది నిజం కాదని నిరూపించాలనుకున్నా. అందుకోసం నాదైన శైలిలో శ్రమించా. ఆ ప్రయత్నమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. డబ్బుని దృష్టిలో ఉంచుకుని ఎప్పుడూ సినిమాలు చేయలేదు. నటిగా ఆ పాత్రకి ప్రాణం పోయాలి, మంచి పేరు తెచ్చుకోవాలనే తపనతోనే పనిచేశా. అయ్యో ఇంతగా శ్రమించానే, అంతా వృథా అయిపోయిందే అని బాధపడాల్సిన అవసరం రాలేదు. 

   సినిమా రంగంలో శ్రమ అనేది పెట్టుబడి. అది తిరిగి ఎప్పుడో ఒకసారి దీటైన రాబడినిస్తుంది. అదే నమ్మకంతోనే నేను ఇప్పటికీ కష్టపడుతుంటా అంటున్నారు సమంత. స్నేహితుడినే జీవిత భాగస్వామిని చేసుకున్న సమంత వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. సమంత, ఆమె భర్త నాగచైతన్య… ఇద్దరూ సినిమాల్లో నటిస్తున్నా, ఇంట్లో ఆ సంగతులే ప్రస్తావనకి రావని చెబుతున్నారామె. పదేళ్లుగా మేం స్నేహితులం. ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు. ఎవరేం అనుకుంటున్నామో ఇద్దరికీ ఇట్టే అర్థమైపోతుంటుంది. ఎంతమందితో కలిసి తెరను పంచుకున్నా… చైతూతో సినిమా చేయడం ప్రత్యేకం. చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పారు సమంత.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss