Thursday, January 21, 2021

Latest Posts

సినీ ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండాలి అంటున్న సమంత

Samantha Akkineni celebrates her birthday with her family

అక్కినేని సమంత- తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయము అవసరం లేని ఈ తార 1987, 28 ఏప్రిల్ నెలలో చెన్నైలొ పుట్టింది. సమంత తెలుగు, తమిళ సినీ జనాలకు సుపరిచితం. సమంత పూర్తి పేరు సమంత రుతు ప్రభు. సినిమా పరిశ్రమకు రాక ముందు మోడలింగ్ చేసిన సమంత తన మొట్ట మొదటి చిత్రం రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించింది. కాగా తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ చిన్నది ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లోకి అడుగుపెట్టింది. నాగ చైతన్యతో నటించిన ఆ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ తో పాటు తెలుగు క్లాస్సిక్స్ లో ఒక స్థానం సంపాంచిందుకున్న ప్రేమ కధా చిత్రం.

ఇక ఆ సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ అయిన బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది చిత్రాలతో నటించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక స్థాయి గుర్తింపు సంపాదించి స్టార్ గా ఎదిగింది. వెటెరెన్ నటి రేవతి తర్వాత తెలుగులోనూ, తమిళంలోనూ ఒకేసారి దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని ఒకే ఏడాదిలో గెలుచుకున్న కధనాయికగా సమంత పేరు తెచ్చుకుంది. ఏ మాయ చేశావే సినిమాకిగాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు మరియు ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్ అవార్డ్వలు కూడా గెలుచుకుంది. తరువాత చైతన్యతో ప్రేమ పెళ్లి వరకు చేరి 2017 లో అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్యని ప్రేమ వివాహం చేసుకుంది.

అక్కినేని కోడలుగా ఎంతో హుందాగా నడచుకుంటూ, సామాజిక కార్యక్రమాలలో కూడా తన భాద్యతను నిర్వహింస్తుంది. తానే ఒక ట్రస్ట్ ని నెలకొల్పి అనాద పిల్లలకు అండగా ఉంటుంది. వివాహం తర్వాత కూడా సినిమాలలో తనదైన నటనతో వినూత్న నటిగా పేరు తెచ్చుకుంది. ‘రంగస్థలం’ ‘మహానటి’ ‘అభిమన్యుడు’ ‘మజిలీ’ ‘సూపర్ డీలక్స్’ ‘ ఓ బేబీ’ వంటి కథా బలం ఉన్న చిత్రాలు చేసి తన నటనా పటిమను మరో సారి రుజువు చేసింది. నటిగా తాను రిటైర్ అయ్యే లోపు తనలో ఉన్న నటనా తృష్టను సంతృప్తి పరచాలని, నటిగా అందరి మనసులో గుర్తుందాలని తన కోరికని బయట పెట్టి, ఈ రోజు తన పుట్టిన రోజు జరుపుకుంటుంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss