Monday, May 10, 2021

Latest Posts

మీడియాకి గట్టిగానే సమాధానం ఇచ్చిన సమంతా

Samantha Comments On Media
సమాజంలో జరిగే సమస్యల గురించి మాట్లాడే అతికొద్ది మంది నటులలో స్టార్ నటి సమంతా అక్కినేని ఒకరు. అయితే అలా స్పందించినప్పుడు వారు చెప్పినవి చాలా మందికి నచ్చకపోవచ్చు. ఒక్కోసారి వారు మాట్లాడే మాటల్లో కూడా తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడు స్పందించే వ్యక్తులను ఇరకాటంలో పడేస్తున్న మీడియా పై ఆమె సరైన రీతిలో సమాధానమిచ్చింది.

నిన్న, సమంతా ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ వీడియోను షేర్ చేసి, “మేము ఎంటర్టైనర్స్, ఫాక్ట్ చెకర్స్ కాదు. ప్రపంచానికి సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి తమ అభిప్రాయాన్ని మేము ఎందుకు షేర్ చేయాలి. మేము కూడా మనుషులం, మేము కూడా తప్పులు చేస్తాము. అయితే ప్రతి అంశంపై  మాట్లాడటం లేదా మాట్లాడకపోవడం అనేది మా ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అంతే కానీ మాట్లాడకపోతే ఏదో నేరం చేసినట్టు చూపిస్తున్నారని ఆమె కొంచెం ఘాటుగానే పోస్ట్ చేసింది.”

అయితే సమంతా ఏ సంఘటనలో ఇలా ఇబ్బంది పడిందో తెలీదు కానీ ఘట్టిగానే సమాధానం ఇచ్చింది. ఇక సమంతా స్పందన పై చిత్ర పరిశ్రమకు చెందిన వివిధ ప్రముఖులు ఆమెను ప్రశంసించారు. ప్రగ్యా జైస్వాల్, యామి గౌతమ్, సింగర్ చిన్మయి వీరంతా కూడా ఆమెను పొగిడారు. మేము చేయలేనిది నీవు చేశావ్ అంటూ తమ బాధను వెళ్ళగక్కారు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss