Samantha Handbag Cost Is Huge
తాము ఆరాధించే స్టార్ సెలబ్రిటీలు ఏ దుస్తులు ధరిస్తున్నారు, ఏ వాచ్ పెట్టుకుంటున్నారు, ఏ మ్యాక్ అప్ కిట్ వాడుతున్నారు ఇలా ప్రతీదీ ఫ్యాన్స్ చర్చించుకుంటుంటారు. తాజాగా ఇప్పుడు ఫ్యాన్స్ అంతా సమంతా హ్యాండ్ బాగ్ గురించి చర్చించుకుంటున్నారు. ఇటీవల ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చిన సమంత ఫొటోలను మీడియా క్లిక్ మనిపించింది. దీంతో ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో సమంత ఎల్లో మిడ్టాప్, డెనిమ్ జాకెట్, లేదర్ హ్యాండ్ బ్యాగ్, ట్రావెల్ బ్యాగ్‌తో కనిపించారు.
అయితే ఇప్పుడు ఆమె కన్ను సమంత చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగు పై పడింది. దాని ధర ఎంత ఉంటుందా అని సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు. అయితే ఈ బ్యాగు ఖరీదు 2 లక్షలకు పైనే ఉంటుందంట. దీని ధర విన్న ఫ్యాన్స్ నోరెళ్ళబెడుతున్నారు. అంతే కాకుండా ఈ ఖరీదైన బ్యాగు సమంత చేతిలో మరింత అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సమంత విజయ్ సేతుపతితో కలిసి తమిళ చిత్రంలో నటిస్తుంది. ఇందులో నయనతార ముఖ్య పాత్రలో కనిపించనుంది.
ఇవి కూడా చదవండి: