Sunday, June 20, 2021

Latest Posts

సమంతా నాగ చైతన్య కలిసి సంపాదించిన ఆస్తి విలువ ఎంతంటే

Samantha Naga Chaitanya Combined Net Worth

టాలీవుడ్ బెస్ట్ కపుల్ లిస్టులో నాగచైతన్య, సమంత ఒకరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తూనే వృత్తిపరంగా రాణిస్తున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు.

అయితే వీరిద్దరి సంపాదన ఎంత ఉంటుంది అనేది హాట్‌ టాపిక్‌గా మారింది.  ప్రస్తుతం సమంత ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు వసూలు చేస్తుందని సమాచారం. గత పదేళ్ల నుంచి టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న సామ్‌.. ఆస్తులను బాగానే కూడబెట్టిందట. ఆమె ఆస్తుల విలువ దాదాపు 85 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే ఆమె రెండు స్టార్టప్‌లను కూడా కలిగి ఉంది. వాటిలో ఒకటి ఏకామ్‌ అనే ఫ్రీ స్కూల్‌ కాగా, మరొకటి ఫ్యాషన్‌ లేబుల్‌ సాకి. వీటి ద్వారా కూడా బాగానే సంపాదిస్తుంది ఈ అమ్మడు. ఆమెకి రూ.76 లక్షల విలువపై విలాసవంతమైన బీఎమ్‌డబ్ల్యూ కారు కూడా ఉంది. వీటన్నింటితో కలిపి సమంత మొత్తం ఆస్తుల విలువ దాదాపు 85 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం.

ఇక నాగ చైతన్య కూడా వరుస సినిమాలతో బాగానే సంపాదిస్తున్నాడు. సినీ కెరీర్‌లోనే ఆయన రూ.40 కోట్ల వరకు సంపాదించినట్లు సమాచారం. అలాగే ఖరీదైన కార్లు, బంగ్లాలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఈ జంట సొంతంగా సంపాదించుకున్న ఆస్తుల విలువ రూ.125కోట్ల వరకు ఉంటుందని సినీ పండితుల అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్‌2’ వెబ్‌ సీరీస్‌లో నటిస్తుంది. త్వరలోనే ఈ సీరీస్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నాగచైతన్య నటించిన ‘లవ్‌స్టోరీ’ సినిమా గతనెలలోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా నిలిచిపోయింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss