Tuesday, January 25, 2022

Latest Posts

తమిళనాడులో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన

Samiyaadis eat human flesh

తమిళనాడు టెంకాసీ జిల్లాలోని కల్లురానీ గ్రామంలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన చోటుచేసుకుంది. తమిళనాడులో ఉండే కొంతమంది సమియాదీలు మనిషి పుర్రెను పట్టుకుని నరమాంసాన్ని తింటూ, పాటలు పాడుతూ వికృత నృత్యాలు చేశారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ నెల 24వ తేదిన తమిళనాడు టెంకాసీ జిల్లాలోని కల్లురానీ గ్రామంలోని శక్తి పోతి సుడలై మదసామి ఆలయం(కట్టు కోవిల్)లో  వేడుకలు జరిగాయి. ఆ వేడుకలలో కొందరు సమియాదీలు పాల్గొనారు. వారు మానవ పుర్రెలను పట్టుకుని పాటలు పాడుతూ వికృత నృత్యాలు చేశారు. అంతేకాక ప్రజల చూస్తుండ గానే నరమాంసాన్ని తింటూ పూనకం వచ్చినవాళ్లలాగా ఊగిపోయారు.

కాగా  దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్​గా మారడంతో విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 10మంది మియాదీలు, ఆలయ కమిటీ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ సంఘటన జరిగినప్పుడు తాము ట్రాన్స్ లోకి వెళ్ళామని మరియు ఆలయ దేవత తమలోకి ప్రవేశించదని సమియాదీలు చెబుతూన్నారు. సమియాదీలు నరమాంసాన్ని  ఏ మృతదేహం నుండి తీసారు. ఎప్పుడు, ఎక్కడ నుంచి వెలికి తీయబడిందనే దానిపై పోలీసులకు ఇంకా ఆచూకీ లభించలేదు. కాగా, సగం కాలిపోయిన మానవ మృతదేహాన్ని ఏదైనా గ్రామ శ్మశానవాటిక నుండి తీసుకువచ్చారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss