Sampoornesh babu makes jewellery to their family on his own :
“సంపూర్ణేష్ బాబు” తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. తన నటనతో అందరిని నవ్వించి మెప్పించిన సంపూర్ణేష్ బాబు సినీ జీవితం హీరోగా కొనసాగుతుంది. కాగా అనేక కామెడీ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. “హృదయ కాలేయం” అనే సినిమాతో పరిచయం అయిన ఈ హాస్య నటుడు ఆ సినిమాతోనే అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. తెలుగు సినీ జనాలలో తనదైన ముద్ర వేసుకున్నాడు. తన నటన శైలి అందరిని నవ్వించే తీరుగా ఉండడం వలన చాల మంది సంపూర్ణేష్ బాబును ఇష్టపడుతూ ఉంటారు. కాగా ఇప్పటికి నాలుగైదు సినిమాల్లో హీరోగా కనిపించిన సంపూర్ణేష్ బాబు కొన్ని కామెడీ క్యారెక్టర్స్ కూడా చేసాడు. ఎంత పేరు వచ్చినా తాను మాత్రం ఎంతో సామాన్యంగా ఉంటాడు. ఇప్పటికీ తన సొంతవూరిలో స్వగృహంలోనే ఉన్న సంపూర్ణేష్ బాబు వృత్తి రీత్యా నగలు చేస్తుంటాడు.
తనకు ఇంత స్టార్ డం ఉన్ననూ తన వృతి పట్ల తనకున్న విశ్వసనీయతను మరో సారి రుజువు చేసాడు సంపూర్ణేష్ బాబు. తన భార్య పిల్లల కోసం పట్టీలు, కాలి చుట్లు తానే స్వయంగా తయారు చేస్తూ ఒక వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా సంపూర్ణేష్ బాబు తానూ సంపాదించిన సినిమా రెమ్యూనరేషన్లో చాల మందికి సాయం చేస్తుంటాడు. ఆంధ్రప్రదేశ్, కేరళలో గతంలో వరదలు వచ్చినప్పుడు సంపూ విరాళాలు అందజేసి తన పెద్ద మనసు చాటుకున్నారు. కర్ణాటకలోని చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తినపుడు వరద బాధితుల కోసం రూ.2 లక్షల విరాళం అందజేశారు. ఇటీవలే #సీసీసీ కి కూడా తన విరాళాన్ని అందించారు.