Thursday, February 25, 2021

Latest Posts

సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్న 7 సినిమాలు

Sankranthi Movies List 2021

ప్రతి ఏడాది తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ సినిమాలకు బెస్ట్ సీజన్ అని చెప్పవచ్చు. రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలన్నీ మంచి వసూళ్లను రాబడుతుంటాయి. గత ఏడాది రెండు భారీ సినిమాలు సాధించిన వసూళ్లు మనం ఇప్పట్లో మర్చిపోలేము. కరోనా కారణంగా సినిమా హాళ్లు మూసివేయ్యడంతో ఈసారి వేడుక ఉండదేమో అనుకున్నారు అంతా. కానీ.. ఎప్పటిలాగే ఈ సారి కూడా తెలుగు వెండితెర మీద సందడి చేయడానికి సిద్ధమయ్యాయి మన సినిమాలు.ఆ చిత్రాలు ఏంటో చూద్దాం.

  1. క్రాక్:
    మాస్‌ మహారాజ్‌ రవితేజ, గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘క్రాక్‌’. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
  2. మాస్టర్:
    తమిళ స్టార్‌ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  మాళవిక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో  విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించాడు.
  3. రెడ్: ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రెడ్’. తమిళ మూవీ ‘తడమ్‌’కు ఇది రీమేక్‌. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో రామ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు.  ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది
  4.  అల్లుడు అదుర్స్: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా నటిస్తున్న సినిమా అల్లుడు అదుర్స్. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా జనవరి 15న రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
  5. జాంబి రెడ్డి: తేజ సజ్జ హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం జాంబిరెడ్డి. ఈ చిత్రం కూడా జనవరి 15న రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.
  6. ఈశ్వరుడు: సింబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు డబ్బింగ్ చిత్రం ఈశ్వరుడు. ఈ సినిమా కూడా సంక్రాంతికి రాబోతుందని సమాచారం.
  7. బంగారు బుల్లోడు: అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఈ బంగారు బుల్లోడు. అయితే ఈ చిత్రాన్ని జనవరి లో విడుదల చేస్తామని ప్రకటించిన దర్శక నిర్మాతలు సంక్రాంతికి రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss