Thursday, May 13, 2021

Latest Posts

సరిలేరు నీకెవ్వరూ క్లైమాక్స్  కొంప ముంచుతుందా

ఒకప్పుడు క్లైమాక్స్ లో  హీరో,హీరోయిన్స్ చనిపోయినట్లు సినిమాలు వచ్చేవి. అయితే ఇలా తీసిన సినిమాలకు రానురాను  జనాదరణ తగ్గడంతో హీరోయిజం కి పెద్ద పీట వేస్తూ సినిమాలు తీస్తున్నారు. ఎందుకంటే,   ఏ సినిమా అయినా క్లైమాక్స్ ని బట్టి  ఉంటుంది.  భారీ బడ్జెట్ తో తీసే, కమర్షియల్ మూవీస్ అయితే క్లైమాక్స్ దుమ్మురేపేస్తుంది.  విలన్ ని అంతమొందించడం ప్రధానంగా  తద్వారా  సమస్య పరిష్కరించడం ప్రధానంగా కనిపిస్తాయి.  అదే  కామెడీ మూవీ అయితే ఫన్నీగా ముగిస్తారు.  అయితే హీరో గానీ హీరోయిన్ గానీ ,ఒక్కోసారి ఇద్దరూ గానీ చనిపోవడం కూడా క్లైమాక్స్ లో చూపించి  విషాదంతో మూవీ ముగిస్తారు.

కానీ  డైరెక్టర్ అనిల్ రావిపూడి స్టైల్ వేరు. కామెడీతో పాటు ఎమోషనల్ టచ్ ఇస్తాడు. తాజాగా అనిల్ తీస్తున్న సరిలేరు నీకెవ్వరూ మూవీలో  సరికొత్త క్లైమాక్స్ ని చూపించబోతున్నాడని పెద్ద చర్చ నడుస్తోంది. ఎందుకంటే  గత సంక్రాంతికి ఎఫ్ 2ద్వారా కూల్ ఎమోషన్స్ తో  కామెడీ కిక్కు ఇచ్చి, బ్లాక్ బస్టర్ హిట్   నమోదు చేసుకున్నాడు.  అంతకుముందు పటాస్ మూవీతో కళ్యాణ్ రామ్ కి హిట్ ఇచ్చాడు.   అలాగే సుప్రీం మూవీ సాయి ధర్మ తేజ్ తో తీసి,కామెడీతో పాటు ఎమోషన్ పండించాడు. అలాగే  రాజా ది గ్రేట్ మూవీలో రవితేజను బ్లైండ్ గా చూపిస్తూ మంచి కామెడీ అందించాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా   సరిలేరు నీకెవ్వరూ భారీ బడ్జెట్ మూవీని అనిల్  తెరకెక్కిస్తున్నాడు. ఒకప్పటి స్టార్ హీరోయిన్, లేడీ అమితాబ్  విజయశాంతి ఈ మూవీలో నటిస్తుండడం విశేషం. దాంతో మిగిలిన సినిమాలకు భిన్నంగా  అనిల్ మార్క్ ఇందులో ఉంటుందని అంచనా వేస్తున్నారు. దానికి తోడు   టీజర్ చూస్తే,అందులో ప్రకాష్ రాజ్ ‘సంక్రాంతికి అల్లుడొస్తాడు,కానీ ఇప్పుడు మొగుడొచ్చాడు’ అని ఎమోషనల్ గా చెప్పే డైలాగ్ కామెడీ పండించేలా ఉంది.  ఆడియన్స్ కి గుర్తుండిపోయేలా క్లైమాక్స్ ఇవ్వాలని అనిల్ ఈ మూవీని  తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss