Home సినిమా వార్తలు కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్స్ తో నిండిపోయిన సరిలేరు నీకెవ్వరు ట్రైలర్

కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్స్ తో నిండిపోయిన సరిలేరు నీకెవ్వరు ట్రైలర్

Sarileru Neekevvaru Trailer

Sarileru Neekevvaru Trailer

 

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ ను లాంచనంగా  జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయించారు. మహేష్ బాబు యాక్షన్ సీన్స్ , ఇతర సీన్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయో ట్రైలర్ లో క్లీయర్ గా చూపించారు. దాంతో సంక్రాంతి పండుగకు మహేష్ బాబు ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఖాయం అనిపిస్తుంది. చిన్న బ్రేక్ ఇస్తున్నాను తర్వాత బొమ్మ దద్దరిల్లి పోద్ది అంటూ మహేష్ బాబు చెప్పిన డైలాగ్ సినిమా థియేటర్లలో దద్దరిల్లేలా చేయడం కన్ఫర్మ్ అన్నట్లుగా మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా నమ్మకంగా చెబుతున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రంను ఈనెల 11న విడుదల కానుంది.

చిరంజీవి ట్రైలర్ లాంచ్ అనగానే ఎల్బీ స్టేడియంలో ప్రేక్షకుల ముందుకు ట్రైలర్ ప్రత్యక్షం అయ్యింది. 2 నిమిషాల 24 సెకన్లు ఉన్న ట్రైలర్ లో మొదటి నిమిషం పాటు ట్రైన్ ఎపిసోడ్ కామెడీ చూపించారు. బండ్ల గణేష్ తో పాటు రాజేంద్ర ప్రసాద్, రష్మిక, సంగీత ఇంకా పలువురి కామెడీ రచ్చ రచ్చ గా ఉండబోతుందని ట్రైలర్ తోనే చెప్పారు. ఫస్ట్ హాఫ్ ఆ ట్రైన్ ఎపిసోడ్ తో హైలైట్ గా నిలుస్తుందన్నట్లుగానే ట్రైలర్ లోనే ఆ సీన్స్ కు సంబంధించిన క్లిప్స్ దుమ్ము లేపేస్తున్నాయి. ఇక ప్రకాష్ రాజ్ , విజయశాంతిల కాంబో సీన్స్ అలాగే విజయశాంతి – మహేష్ బాబుల కాంబో సీన్స్ సినిమాకు మరింత హైలైట్ గా నిలుస్తాయని ట్రైలర్ చెప్పకనే చెబుతున్నాయి.

నిన్న మొన్నటి వరకు సినిమా ప్రమోషన్ వీడియోలు, పోస్టర్స్ లో రష్మికకు స్కోప్ ఇవ్వడం లేదంటూ రష్మిక అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశారు. కాని ట్రైలర్ ఆరంభమే రష్మిక నీకు అర్థం అవుతుందా అంటూ చెప్పిన డైలాగ్ సూపర్బ్ గా ఉంది. మహేష్ బాబు ఈ చిత్రంతో తన రికార్డులను తానే బ్రేక్ చేయడంతో పాటు బాహుబలి మొదటి పార్ట్ రికార్డులను కూడా కొల్లగొట్టే ఛాన్స్ కూడా ఉందని అభిమానులు అంచనా వేసేస్తున్నారు.

 

Exit mobile version