Tuesday, January 25, 2022

Latest Posts

సార్పట్ట పరంపరలో డ్యాన్సింగ్ రోజ్ గా చేసిన వ్యక్తి ఎవరో తెలుసా?

Sarpatta Parampara Dancing Rose Biography

హీరో ఆర్య నటించిన సార్పట్ట పరంపర సినిమా చూసిన ప్రతీ వారికి ఒక్కటే సందేహం. అదే ఇందులో డ్యాన్సింగ్ రోజ్ చేసిన వ్యక్తి గురించి. అతని ఇంపాక్ట్ సినిమాలో ఎంతగా ఉందంటే, అతను చేసింది 15 నిమిషాలే అయినా హీరో తర్వాత ప్రేక్షకులు ఎక్కువగా గుర్తుపెట్టుకున్నది ఇతన్నే. విలన్ రోల్ ని కూడా డామినేట్ చేస్తూ చివర్లో ఇతనితో ఫైట్ ఉంటే బాగున్ను అనేలా చేశాడు.

అయితే ఇప్పుడు ఈ డ్యాన్సింగ్ రోజ్ గురించి వివరాలు తెలుసుకుందాం. ఇతని అసలు పేరు షబీర్‌ కళ్ళరక్కల్‌. ఇతను చెన్నై థియేటర్‌ ఆర్టిస్ట్‌. అయితే 2009 లోనే నటన వైపు అడుగులు వేశాడు. యాభైకి పైగా స్టేజ్‌ షోలతో థియేటర్‌ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ పై ‘నెరుంగి వా ముథమిడతే’(2014) హీరోగా కూడా ఒక సినిమా కూడా చేశాడు షబీర్‌. కానీ, ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సైడ్ క్యారెక్టర్ గా ‘అడంగ మరు, పెట్టా, టెడ్డీ’ లాంటి పెద్దసినిమాల్లో చిన్నరోల్స్‌ చేశాడు.

అయితే ఇప్పటి వరకు అతను పెద్దగా సక్సెస్ కాకపోయినా అతను పడ్డ కష్టంతో ఇప్పుడు ప్రేక్షకుల మనస్సును గెలుచుకున్నాడు. ఇందులో డైరెక్టర్ పా రంజిత్ గొప్పతనం కూడా ఉందనే చెప్పాలి. ముందు నుంచే ఫిట్నెస్ పై దృష్టి ఉన్న రోజ్ ని ఈ సినిమాలో స్లిమ్‌ ఫిట్‌ బాడీ, నుదుట రింగు, విచిత్రంగా మెలికలు తిరుగుతూ వేసే స్టెప్పులు. రింగ్‌లో ఊగిపోతూ ఓడిపోతున్నట్లుగా ప్రత్యర్థులను భ్రమపెట్టి, కాళ్ల వేగంతో కన్ఫ్యూజ్‌ చేసి బాక్సింగ్‌లో గెలుపు సాధించే విధంగా ఇతని క్యారెక్టర్ ని చూపించాడు.

ఇకపోతే ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు షబ్బీర్. ఈ సినిమా కోసం మార్షల్‌ ఆర్ట్స్‌ కళలో శిక్షణ పొందాడు. స్టంట్‌ మాస్టర్‌ తిరు నేతృత్వంలో రకరకాల కళలను సులువుగా అవపోసన పట్టగలిగాడు. అంత కష్టపడ్డాడు గనుకే డ్యాన్సింగ్‌ రోజ్‌ సీక్వెన్స్‌లన్నీ అంతగా పేలాయి. ఇక అతను పడ్డ కష్టం వృధా కాకుండా అతనికి మంచి గుర్తింపు వచ్చింది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss