Tuesday, April 13, 2021

Latest Posts

సౌదీ  యువరాణి ఆరోగ్యం విషమం – జైలు నుంచి విడుదలకు వినతి

saudi princess basmah bint saud in prison and poor health

ప్రపంచమంతా కరోనా మహమ్మారితో అట్టుడికిపోతుంటే ఇక సౌదీ అరేబియాలో మరో విచిత్ర ఘటన కనిపిస్తోంది. అక్కడ కూడా కరోనా మహమ్మారి ఉంది. అయితే చాలాకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న  సౌదీ అరేబియా యువరాణి  బస్మా బింతే సౌద్ (56) ఆరోగ్యం విషమంగా ఉందట.  ఈ విషయాన్ని ఆమె ట్వీట్ చేస్తూ,..  దయచేసి సహాయం చెయ్యండి, లేకపోతే చనిపోతాను’ అని పేర్కొన్నారు.

కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్, క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్ ల నుండి తనను విడుదల చేయాలని ఆమె అభ్యర్థించారు. తన ఆరోగ్యం మరింత దిగజారింది. ఇది మరణానికి కూడా దారితీయవచ్చు. జైలులో వైద్య సదుపాయం లేదు. సమయానికి చికిత్స చేయకపోతే చనిపోతానని ట్విట్టర్‌లో పేర్కొంది. ఈ ట్వీట్లు ఇప్పుడు తొలగించారు. ఆమె సౌదీ దేశ స్థాపకుడి మనవరాలు. 1953 నుండి 1964 వరకు సౌదీ అరేబియా పాలకుడిగా ఉన్న సౌద్ చిన్న కుమార్తే ఈ బస్మా బింతే సౌద్  సౌదీలో మార్పు కోసం ప్రసంగాలు చేసిది.  ఆమె వ్యాసాలు వార్తాపత్రికలలో కనిపించేవి. మహిళల హక్కుల గురించి మాట్లాడటానికి ప్రయత్నించేది.

అంతేకాదు   2018 లో యెమెన్ యుద్ధాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తూ, యుద్ధాన్ని ముగించాలని కూడా విజ్ఞప్తి చేశారు. దీంతో 2019 ఫిబ్రవరిలో ఆమెను అరెస్టు చేశారు. ఇక ఆరోగ్యం దెబ్బతిందని ఆమె  ఏప్రిల్ 16 న ట్వీట్ చేశారు. దీనిలో తాను  ఎటువంటి కారణం లేకుండా జైలు పాలయ్యానని పేర్కొన్నారు. తన కేసును సమీక్షించాలని ఆమె సల్మాన్ రాజు, క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్లను కోరారు. నా ఆరోగ్యం దిగజారింది. ఇది నా మరణానికి దారితీస్తుంది. నేను వైద్య సేవల కోసం జైలు నుండి రాయల్ కోర్టుకు చాలాసార్లు లేఖలు రాశాను.  కాని ఎలాంటి స్పందన లేదు అని ఆమె ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్లన్నీ ఇప్పుడు తొలగించారు. ఇక  సౌదీ అధికారుల నుండి ఎలాంటి  స్పందన లేకపోవడం విశేషం.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss