Tuesday, March 9, 2021

Latest Posts

6 నెలలు ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు – ఎస్బీఐ

SBI Apply EMI Moratorium

లాక్‌డౌన్ కారణాంగ అన్ని సంస్థలు మూతపడ్డాయి. అత్యవసర సేవల్లో విధుల్లో ఉన్నవారు, వర్క్‌ఫ్రమ్‌ హోం ఉద్యోగాలు చేసేవాళ్లు మరికొందరు తప్ప ,చాలా మందికి అయితే  జీతాలు వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇక, కూలీల పరిస్థితి మరీ దారుణం ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాల్లో కోతపెట్టేశారు. అయితే లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న ప్రజలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్‌ లేదా ఎమర్జెన్సీ లోన్‌ను తీసుకువచ్చింది.కేవలం 45 నిమిషాల వ్యవధిలోనే రూ.2 లక్షల వరకు లోన్‌ పొందే అవకాశం కల్పిస్తోంది. అంతే కాదు ఇప్పుడు లోన్‌ తీసుకుని ఈఎంఐ ఎలా చెల్లించాలనే టెన్షన్ కూడా లేదు ఎందుకుంటే ఈ లోన్లకు 6 నెలల వరకు ఎలాంటి ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు.ఈ ఆరు నెలలు గడిచిన తర్వాత 7.25 శాతం వడ్డీతో లోన్‌ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ జరుగుతున్నందున దేశం మొత్తం ఆర్ధిక భారాన్ని మోస్తుంది. చాలా షాపులు మరియు వ్యాపార సంస్థలు కూడా మూసివేయబడటంతో చిన్న, మధ్యతరగతి కుటుంబాలు బ్రతుకు జీవుడా అంటున్నారు. ఇలాంటి సమయంలో ఏ కారణం చేతనైనా డబ్బు అవసరమైతే, మీకు సహాయం చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాఅత్యవసర రుణాన్ని ప్రవేశపెట్టింది. ఎస్బీఐ బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం కూడా లేకుండా ఇంట్లో ఉండే కేవలం 45 నిమిషాల్లో ఈ రుణాన్ని పొందవచ్చు అని తెలిపింది.

ఇది కూడా చదవండి: టీచర్లకు మద్యం దుకాణాల వద్ద డ్యూటీ ?

అలాగే మరోవైపు మొదటి ఆరు నెలలు ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదు. అందువల్ల మే నెలలో లోన్‌ తీసుకుంటే అక్టోబర్ తర్వాత ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తిగత రుణం రూ .2 లక్షల వరకు పొందే అవకాశం ఉండగా పెన్షన్ లోన్ రూ. 2.5 లక్షల వరకు ఇతర లోన్లు రూ.5 లక్షల వరకు ఉంది. ఈ లోనే ఎవరికి కావాలో వారు ఎస్‌బి‌ఐ సూచించిన మొబైల్ అప్ ద్వారా ధారకస్తూ చేసుకోవాలి. అప్పుడు మీరు రుణానికి అర్హులా? కాదా? అనే విషయాన్ని బ్యాంక్ తెలియజేస్తుంది. అర్హత గల వ్యక్తులకు  నాలుగు ప్రక్రియలలో రుణం లభిస్తుంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss