SBI slams interest rates over corona effect
లాక్ డౌన్ తో దేశం ఆర్దికంగా ఇబ్బంది దృష్ట్యా ఆర్బిఐ రెపో రేటు రేటును తగ్గించింది. వాటి తగ్గింపు ప్రభావం బ్యాంకుల పొదుపు ఖాతా సవ్ఇంగ్ డిపాజిట్ల పైనా పడింది. డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును 0.25% తగిస్తునట్లు అంటే ప్రస్తుత మూడు శాతం నుంచి 2.75 శాతానికి తగ్గిస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. ఈ తగ్గింపు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు.
అదనపు నిధుల సమీకరణ వ్యయం (ఎంసీఎల్ఆర్) ఆధారంగా ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును 0.35 శాతం తగిస్తున్నట్లు అంటే ప్రస్తుతం 7.75 శాతం నుంచి 7.40 శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఈ తగ్గింపు ఈ నెల 10 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ తాగింపుల వల్ల 30 ఏళ్ల కాలపరిమితి ఉండే హోమ్ లోన్‌పై చెల్లించే ఈఎంఐ ప్రతి లక్ష రూపాయలకు, 24 రూపాయలు చొప్పున తగ్గుతుందని ఎస్బీఐ తెలిపింది.