Saturday, January 16, 2021

Latest Posts

మధ్యప్రేదేశా మజాకా .. జెట్ స్పీడ్ లో మారిన రాజకీయం

MP crisis: The numbers once Speaker accepts resignation of 20 Congress MLAs:

రాజకీయాలు ఎంతవేగంగా మారిపోతాయి మధ్యప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు చూస్తే ఈజీగా తెలిసిపోతుంది. అక్కడ రాజకీయాలు జెట్ స్పీడ్ లో మారిపోతున్నాయి. సోమవారం తన వర్గం ఎమ్మెల్యేలతో బెంగళూరుకు మకాం మార్చిన కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా.. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం, ఆ వెంటనే కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. సింధియా రాజీనామా చేసిన వెంటనే తన వర్గపు 20మంది ఎమ్మెల్యేలు తమ పదవి రాజీనామా చేశారు.

ఈ మేరకు తమ రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించారు. వీరిలో ఆరుగురు మంత్రులు కూడా ఉండడం విశేషం. దీంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడిపోయింది.మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 230గా ఉంది. అయితే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఒక బీజేపీ ఎమ్మెల్యే మృతి చెందడంతో ప్రస్తుత సభ్యుల సంఖ్య 228కి చేరింది. కాంగ్రెస్‌ 114, బీజేపీ 107, స్వతంత్రులు 4, బీఎస్పీ 2, ఎస్పీ ఒక ఎమ్మెల్యే బలం కలిగిఉంది.

గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీని బట్టి కాంగ్రెస్‌కి స్వతంత్రులు, మిత్రపక్షాలు మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు 20మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. మరోవైపు మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. మరోసారి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కే మధ్యప్రదేశ్‌ పగ్గాలు అప్పగించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss