Wednesday, December 1, 2021

Latest Posts

పారిశుధ్య కార్మికులకు అండగా శేఖర్ కమ్ముల

Sekhar kammula distributing food supplies to sanitary workers :

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ తారలు, డైరెక్టర్లు, హీరోయిన్లు తమ తమ సహాయాన్ని కరోనా మహమ్మారి కమ్ముకున్న ఈ తరుణంలో పారిశుధ్య కార్మికులను, సహాయార్డులకు అందచేస్తున్నారు. ఇదే కోవలోకి డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా తనదైన సామాజిక భాధ్యతను చాటుకున్నారు.

“పోలీసులు, డాక్టర్లు తరువాత మనము పారిశుధ్య కార్మికులను గుర్తిస్తున్నామని, వారి సేవలు అమోఘమని. కానీ వారికి ఇంత గౌరవాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని, మన దృష్టిలో వారి మీద చిన్న చూపు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో వారు చేస్తున్న సేవకు అందరి భావాల్లో మార్పులు వచ్చాయని, వారి మీద గౌరవాన్ని అందరు వారి పూలు జల్లి, వారికి సేఫ్టీ కిట్స్ అందించి చాటి చెబుతున్నారని, మనం వారి కష్టాన్ని కళ్లారా చూస్తున్నామని, మనం ఇంట్లోనే ఉంటున్నాం కానీ వారు ఇలాంటి పరిస్థితులలో రోడ్ల మీద కష్టపడుతున్నారు. వారి కష్టాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని” తెలిపారు. అందుకే తను కూడా నెల రోజుల వరకు వెయ్యి మందికి త్రాగడానికి పానీయాలను అందించనున్నట్టు తెలిపారు. కాగా తను కూడా తన సినిమా షూటింగ్లో పనిచేసిన వారందరికీ రెండు నెలల సాలరీని ముందుగానే ఇచ్చేసినట్టు తెలిపారు. ఎవరైనా పారిశుధ్య కార్మికులకు తమ సహాయాన్ని చెయ్యదలచుకుంటే GHMC కి నేరుగా వారి సహాయాన్ని అందిస్తే వారు సహాయాన్ని చేరవేస్తారని తెలిపారు.

కాగా సీసీసీ ఆధ్వర్యంలో చిరంజీవి గారు తలపెట్టిన సినీ మార్మికులకు నిత్యావసర వస్తువులు ఇచ్చే కార్యక్రమాన్ని అందరు ముందుకు వచ్చి నడపడం చాలా ఆనందాన్ని కలిగించే అంశం అని అభిప్రాయపడ్డారు. అలాగే తన సహాయాన్ని మంత్రి చలసాని శ్రీనివాస యాదవ్ సమక్షంలో పారిశుధ్య కార్మికులకు అందచేశారు. శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగ చైతన్యతో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా షట్ డౌన్ కారణంగా షూటింగ్ పనులకు కూడా అంతరాయం జరిగి ప్రస్తుతం ఇటువంటి సహాయ కార్యక్రమాలను సినీ తారలు చేస్తుండటం అభినందనీయం.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss