Wednesday, June 23, 2021

Latest Posts

వారు నాపై చూపించిన ప్రేమ అమూల్యం: శేఖర్‌ కమ్ముల

హైదరాబాద్‌: తమకు పాలు, మజ్జిగ పంపిణీ చేసిన దర్శకుడు శేఖర్‌ కమ్ములకు పారిశుద్ధ్య కార్మికులు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపారు. థాంక్యూ శేఖర్‌ కమ్ముల గారు అంటూ ఇంగ్లిషులో రాసిన ప్లకార్డులను చేతిలో పట్టుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను శేఖర్‌ కమ్ముల ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. వారి మనసులో చోటు సంపాదించుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. గాంధీ ఆసుపత్రి జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు నాపై ప్రేమను చూపించిన తీరు అమూల్యం. ఇది నాకు లభించిన అతి పెద్ద అవార్డు. నా పని మీ హృదయాల్ని తాకడం అమితమైన ఆనందాన్ని ఇచ్చింది. కానీ మీరు మా కోసం నిరంతరం శ్రమిస్తున్న దాని ముందు ఇది చాలా చిన్నది అని ఆయన పోస్ట్‌ చేశారు.

ఇది కూడా చదవండి:కరోనా ఎఫెక్ట్….న్యాయవాదులకు కొత్త డ్రెస్‌ కోడ్‌

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss