Sunday, January 17, 2021

Latest Posts

అమ్మ బయోపిక్ పై క్లారీటి ఇచ్చిన నరేష్..!!

Senior Actor Naresh gives clarity of his mother Vijaya Nirmala Biopic

ఓ వ్యక్తిగా అనేక విజయాలను అందుకున్న నటి విజయ నిర్మల జీవితం అద్భుతం. మేల్ డామినేటెడ్ సొసైటీలో వాళ్లకు గట్టి పోటీ ఇచ్చిన మహిళా నటి ఈమె. నటిగా, దర్శకురాలి గా, నిర్మాతగా ఆమె అనేక రంగాలలో తన సత్తా చాటారు . లేడి డైరెక్టర్ గా 44 సినిమాలకు దర్శకత్వం వహించినందుకు గాను 2002లో విజయ నిర్మల గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నెలకొల్పారు. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న విజయ నిర్మల 1969లో సూపర్ స్టార్ కృష్ణను వివాహం చేసుకోగా… అప్పటి నుండి వీరిద్దరూ అన్యోన్య దంపతులుగా ఆమె మరణం వరకు కలిసి జీవించారు.

ఇకపోతే  కొద్దిరోజులలో విజయ నిర్మల బయో పిక్ సెట్స్ పైకి వెళుతున్నట్టు, అందులో విజయ నిర్మలగా కీర్తి సురేష్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై విజయ నిర్మల కుమారుడు నటుడు నరేష్ స్పందింస్తు…. అమ్మ విజయ నిర్మల బయో పిక్ తెరకెక్కించే హక్కులు ఎవరికీ ఇవ్వలేదని అన్నారు. విజయ నిర్మల బయో పిక్ తెరకెక్కనుంది అని వస్తున్న వార్తలలో నిజం లేదని ఆయన అన్నారు. ఇక బ్రతికి కున్న రోజులలో ఆమె నరేష్ తో తన బయో పిక్ తెరకెక్కించాలని కోరటం జరిగిందట. దీనితో ఆయనే స్వయంగా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నానని… ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లడాని ఏడాదికి పైనే సమయం  పడుతుందని ఈ సందర్భం గా నరేష్ స్పష్టత ఇచ్చారు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss