Tuesday, January 25, 2022

Latest Posts

కారు వైపు మొగ్గు చూపుతున్న పెద్ది‌రెడ్డి

Senior TDP leader Peddi Reddy to join TRS

హుజురాబాద్‌లో బీజేపీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఇనుగల పెద్ది‌రెడ్డి ఈ రోజు రాజీనామా చేసిన వి షయం తెలిసిందే. ఆయన బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన్ని ఆకర్షించేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తుంది. టీఆర్‌ఎస్ కండువా కప్పుకొనేందుకు పెద్దిరెడ్డి మంచి ముహూర్తం చూసుకుంటున్నా ప్రచారం తెలంగాణ రాజకీయ వర్గాలలో బలంగా జరుగుతుంది. కాగా  హుజురాబాద్ నియోజకవర్గం మంత్రి ఈటల రాజేందర్ పార్టీలో చేరికను ఆయన మొదటి నుండి వ్యతిరేకించారు.

రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉండగా అప్పటి నుండే పెద్దిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తుండగా ఆయన పార్టీకి గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం కూడా జరుగుతూ వచ్చింది. చివరికి ఆయన పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. పెద్దిరెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పని చేయగా టీడీపీలో ఉన్నంత కాలం కరీంనగర్ జిల్లాలో ఆయన బలమైన నాయకుడిగా ఒక వెలుగు వెలిగారు. తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రశ్నార్థంగా మారిన నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరగా.. ఈటల కమలం గూటికి చేరడంతో పెద్దిరెడ్డి అక్కడ ఇమడలేక టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపుతున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss