కరోనాకు టీకా వస్తోందనే అంచనాలు, బీహార్ లో మరోసారి ఎన్డీయే గెలవబోతోందనే ట్రెండ్స్ తో మార్కెట్లు దూసుకుపోయాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 680 పాయింట్ల లాభంతో 43,278కి చేరుకుంది. నిఫ్టీ 170 పాయింట్లు పుంజుకుని 12,631 వద్ద స్థిరపడింది. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోను వెనుకడుగు వేయలేదు. 43వేల మార్క్ దాటిన సెన్సెక్స్ జీవనకాల గరిష్టాన్ని తాకింది. టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్ 8.89 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 7.71 శాతం, లార్సన్ 7.02 శాతం, బజాజ్ ఫిన్సర్వ్ 6.43 శాతం, హెచ్డీఎఫ్సీ 5.58 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో సిప్లా 6.01 శాతం, టెక్ మహీంద్ర 5.90 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 5.30 శాతం, దివిస్ ల్యాబ్స్ 4.68 శాతం, నెస్లె 4.20 శాతం నష్టపోయాయి. నేటి యాక్టివ్ స్టాక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: