Sunday, June 20, 2021

Latest Posts

నితిన్ సినిమాను కొట్టేసిన శర్వానంద్

Sharwanand Takes Nithin Movie

కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ పవర్ పేటా అనే చిత్రం చేయడానికి అంగీకరించాడు. అయితే ఈ చిత్రానికి భారీ బడ్జెట్ కూడా కేటాయించారు. తీరా చూస్తే పవర్ పేటాకు అంత సమయం కేటాయించలేనని నితిన్ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుందని తెలియడంతో నితిన్ ఈ చిత్రం నుంచి బయటికి వెళ్లిపోయాడు.

తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు కృష్ణ చైతన్య ఈ చిత్రం కోసం శర్వానంద్‌ను సంప్రదించారని మరియు పూర్తి కథను వివరించారని తెలుస్తుంది. శర్వాకు కూడా సినిమా కథ నచ్చిందని త్వరలోనే ఈ సినిమాకు ఓకే చెప్పే అవకాశం ఉన్నట్లు టాక్. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

పవర్ పెటా కథ 1960 మరియు 2021 సంవత్సరాల మధ్య రెండు భాగాలుగా జరుగుతుంది. శర్వా మూడు వేర్వేరు పాత్రలలో కనిపించనున్నాడు. ఒకటి 18 ఏళ్ల టీనేజ్, రెండవది 40 ఏళ్ల వ్యక్తి మరియు మూడవది 60 సంవత్సరాల ముసలి వ్యక్తిగా కనిప్ఞ్చబోతున్నాడు. కీర్తి సురేష్  హీరోయిన్ గా నటించనుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss