Tuesday, January 25, 2022

Latest Posts

పరువు నష్టం దావా కింద శిల్పా శెట్టికి 25 కోట్లు కావాలంట

Shilpa Shetty Files Defamation Case

అశ్లీల వీడియో చిత్రీకరణ కేసులో నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ పై పరువు నష్టం కలిగించేలా వార్తలు ప్రచురించినందుకు ఫేస్బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్‌లకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టును శిల్పా శెట్టి ఆశ్రయించింది. తమకు పరువు నష్టం కలిగించిన వారు 25 కోట్లు చెల్లించాలని ఆమె డిమాండ్ చేసింది. వారి రీడర్‌షిప్ మరియు వ్యూయర్‌షిప్‌ను పెంచే లక్ష్యంతో తమ పేరును పాడుచేస్తున్నారని ఆమె తెలిపింది.

అశ్లీల కేసుకు సంబంధించి క్రైమ్ బ్రాంచ్ ముంబై పోలీసులు శిల్పా శెట్టి వద్ద వాంగ్మూలం తీసుకున్నారు. తన భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను చిత్రీకరిస్తునట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హాట్ షాట్స్ యాప్‌లోని కంటెంట్ గురించి తనకు తెలియదని నటి పోలీసులకు తెలిపింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త కుంద్రా, జూలై 19 న అశ్లీల చిత్రాలను చిత్రీకరించినందుకు మరియు యాప్‌ల ద్వారా వాటిని షేర్ చేస్తున్నందుకు ముంబై పోలీసులు అతనిని అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss