Sunday, February 28, 2021

Latest Posts

మండలి ఎన్ని రాష్ట్రాల్లో ఉందొ తెలిస్తే షాకవుతారు

ఏపీలో వికేంద్రీకరణ తదితర బిల్లులను శాసన సభ ఆమోదించి శాసన మండలికి పంపగా అక్కడ సెలక్ట్ కమిటీకి పంపాలన్న నిర్ణయంతో కంగు తిన్న సీఎం జగన్ ఈ ఘటన బాధించిందని చెప్పడమే కాదు, మండలి అవసరం ఉందా అని కూడా ప్రశ్నించారు. దీంతో ప్రస్తుతం ఏపీ లో శాసనమండలి ఉనికిపై తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో భారీ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఏపీ సర్కార్ మండలిలో సరైన సంఖ్యా బలం లేక పార్టీ కీలకంగా భావించిన కొన్ని బిల్లుల్ని ఆమోదించుకోలేకపోతుంది. వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోని ప్రవేశ పెట్టిన మూడు రాజధానుల బిల్లుని మండలి సెలెక్టెడ్ కమిటీ కి పంపించడం తో వైసీపీ మండలిని రద్దు చేసే ప్రయత్నం చేస్తునట్టు టాక్ నడుస్తోంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 ప్రకారం రాష్ట్రాల్లో విధాన పరిషత్(మండలి) లను ఏర్పాటు చేస్తారు. అయితే అసలు దేశంలో 28 రాష్ట్రాలు ఉండగా 22 రాష్ట్రాల్లో శాసనమండలి వ్యవస్థ లేనే లేదు. ప్రస్తుతం కేవలం ఆరు రాష్ట్రాలలోనే శాసనమండలి వ్వవస్థ అందుబాటులో ఉంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ – బీహార్ – ఉత్తరప్రదేశ్ – కర్నాటక – మహారాష్ట్రలో మాత్రమే శాసన మండలి వ్యవస్థ కొనసాగుతుంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేసే దిశగా పావులు కదుపుతుండడంతో ఏపీ ప్రభుత్వం నిజంగానే శాసనమండలిని రద్దు చేస్తే, ఇక దేశంలో ఐదు రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండళ్లు మాత్రమే ఉండే అవకాశముంది.

బీహార్ – కర్నాటకలో 75 మంది చొప్పున ఎమ్మెల్సీలు ఉన్నారు. మహారాష్ట్రలో 78 మంది -తెలంగాణలో 40 – ఉత్తరప్రదేశ్లో 100 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. జమ్ము కశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం తో గత ఏడాది అక్కడ శాసన మండలి ని రద్దు చేశారు. గతంలో అసోం – మధ్యప్రదేశ్ – తమిళనాడు – పంజాబ్ -పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కూడా శాసనమండళ్లు ఉండేవి. అయితే ఈ రాష్ట్రాల్లో శాసనమండలి వ్యవస్థ రద్దు చేశారు. కాగా ఒడిశా – రాజస్థాన్ -ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో కూడా మళ్లీ శాసనమండలి వ్యవస్థ ని తీసుకురావాలి అనే డిమాండ్ అయితే వినిపిస్తుంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss