గ్రామ సచివాలయ ఉద్యోగాల్ని ఇప్పించి జగన్ చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాన్ని తీసుకున్నారని వైసీపీ నేతలు ప్రశంసల జల్లు కురిపించారు. అయితే ఈ గ్రామా సచివాలయ అప్పాయింట్మెంట్ లెటర్లలో వున్న నిబంధనలు చూసాక ఉద్యోగులు షాక్ కి గురయ్యారు. ఇందులో ప్రొహిబిషన్ పీరియడ్ రెండేళ్లు అని, మూడు సంవత్సరాలు జాబ్ చేయాల్సిందేనని ఉద్యోగులకి అధికారులు చెప్పడం విశేషం. అయితే పెద్ద పెద్ద ఉద్యోగాలకి ప్రయత్నిస్తూ వుండే వాళ్ళు చాలామందే వున్నారు.
గ్రూప్స్, తదితర, స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యేవారికి ఇది ఊహించని షాక్. గ్రామ సచివాలయ ఉద్యోగాలతో సంతోషంగా ఉన్నప్పటికీ ఇలాంటి నిబంధనలతో పెద్ద ఉద్యోగాలకి వెళ్లలేని పరిస్థితి ఉండటం తో ఈ ఉద్యోగాల్లో చేరాలా? వొద్దా? అనే డైలమా లో గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మధ్యలో వెళ్లాల్సి వస్తే ట్యూషన్ ఫీజ్, మరియు గౌరవ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాల్సింది గా పేర్కొనడం గమనార్హం. ఇలాంటి నిబంధనలు పెట్టడం తో ప్రభుత్వం పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది ప్రభుత్వం వ్యవహరించాల్సిన విధానం కాదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విమర్శలని జగన్ ఎలా తిప్పి కొడతారో వేచి చూడాలి.